Video: Dancing as Hanuman.. Died on stage
mictv telugu

ఘోరం..హనుమంతుని వేషాధారణతో డ్యాన్స్‌..స్టేజ్‌పైనే మృతి

September 4, 2022

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. హనుమాన్‌ వేషాధారణతో భక్తులను అలరిస్తూ, స్టేజ్‌పై అటు ఇటు తిరుగుతూ, ఉన్నట్టుండి స్టేజ్‌పైనే ఆ కళకారుడు కుప్పకూలి మృతి చెందాడు. మొదటగా అందరూ అంతగా పట్టించుకోలేదు. కొద్దిసేపటికి అతనిని ఎన్నిసార్లు లేపిన లేవకపోవడంతో షాక్ అయ్యారు. ‘అయ్యో ఇప్పుడే కదా, అందరినీ అతని డ్యాన్స్‌తో, పాటలతో అలరించాడు. ఇంతలోనే ఇలా జరిగింది ఏంటి?’ అని ఆశ్చర్చానికి లోనైయ్యారు. అనంతరం ఆసుపత్రికి తీసుకెళ్లిన ఫలితం దక్కలేదు. అప్పటికే అతడు మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది.

 

వివరాల్లోకి వెళ్తే.. గణేష్‌ చతుర్థి వేడుకల్లో భాగంగా మెయిన్‌పురి కొత్వాలి ప్రాంతంలోని శివాలయంలో భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. రవి శర్మ అనేక కళాకారుడు హనుమంతుని వేషధారణలో గణేష్‌ మండపం వద్ద లైవ్‌ పర్ఫామెన్స్‌ ఇచ్చాడు. తన హుషారైన నటనతో అక్కడున్న పిల్లల్ని, పెద్దల్ని అలరించాడు. రవి శర్మ ప్రదర్శన చూసి అక్కడున్నవారంతా అతనిలో ఉత్సాహాన్ని నింపారు.

ఈ క్రమంలో స్టేజ్‌పై ప్రదర్శన చేస్తుండగా, మధ్యలోనే రవి శర్మ ఉన్నట్టుండి కుప్పకూలి కిందపడిపోయాడు. ఏమైందో తెలుసుకునేందుకు అక్కడున్న వారికి కాస్తా సమయం పట్టింది. ఎంతకీ రవి శర్మ లేవకపోవడంతో అనుమానం వచ్చి, అతన్ని లేపగా స్పృహ కోల్పోయి ఉన్నాడు. దాంతో వెంటనే అతన్ని మెయిన్‌పురి జిల్లా అసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.