Video: Delhi Woman Fights Off Man Who Tried To Snatch Her Phone
mictv telugu

ఎదురుపడిన దొంగకు చుక్కలు చూపించిన యువతి.. వీడియో

September 8, 2022

అర్ధరాత్రి ఒంటరిగా వెళ్లాలంటేనే చాలామంది అమ్మాయిలు భయపడుతుంటారు. కానీ ఓ అమ్మాయి రాత్రి వేళ తనకు ఎదురుపడిన దొంగ బారి నుంచి బయటపడడమే కాకుండా అతడికి చుక్కలు చూపించింది. అతడి వెన్నులో వణుకు పుట్టించింది. ఢిల్లీలోని బదర్పూర్ ప్రాంతంలో రాత్రి వేళ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతి వద్దకు ఓ స్నాచర్ దూసుకొచ్చి ఆమె చేతిలోని మొబైల్ ఫోనును లాగబోయాడు. దీంతో ప్రతిఘటించిన ఆ యువతి అతడిపై తిరగబడింది. అతడి టీ-షర్టను పట్టుకుని ఎంతకీ వదలలేదు. దీంతో ఆ యువతిపై ఆ దొంగ దాడి చేయడానికి ప్రయత్నించాడు.

అయినప్పటికీ అతడిని ఆ యువతి సమర్థంగా ఎదుర్కొంది. ఆమె ఎంతకూ అతడిని వదలకపోవడంతో ఇక ఆమెతో పోరాడి లాభం లేదనుకున్నాడు. ఇంతలో ఆ మొబైల్ ఫోను కిందపడిపోయింది. దీంతో అక్కడి నుంచి దొంగ పరుగులు తీశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్ళింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగను పట్టుకునేందుకు గాలిస్తున్నారు. ఆ అమ్మాయి టిక్రీ ప్రాంతానికి చెందిందని, తాజ్‌పూర్ పహారీలోని ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు వివరించారు.