Video: Elephants stuck in mud..Do you know how they were saved..
mictv telugu

వీడియో: బురదలో చిక్కుకున్న ఏనుగులు..ఎలా రక్షించారో తెలుసా..

September 15, 2022

కెన్యా దేశంలో నీళ్లకోసం వచ్చిన రెండు ఆడ ఏనుగులు బురదలో చిక్కుకుని రెండు రోజులపాటు నానా అవస్థలు పడ్డాయి. గమనించిన స్థానికులు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆ ఏనుగులను బురద నుంచి బయటికి లాగలేకపోయారు. పాపం బయటికి వెళ్లలేక, ఊపిరి ఆడక ఆ రెండు ఏనుగులు కేకలు వేస్తూ, వాటిని బాధను తెలియజేశాయి. వాటి అవస్థను చూడలేక, చేసిన ప్రయత్నాలు విఫలంకావడంతో స్థానికులు ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు. దాంతో అప్రమత్తమైన అధికారులు..హెలికాప్టర్ సాయంతో ఏనుగులు చిక్కుకున్న ప్రాంతానికి చేరుకొని, రెస్క్యూ చేసి, బురదలో చిక్కుక్కుపోయిన ఏనుగులకు తాళ్లు కట్టి ట్రాక్టర్, కారు సాయంతో అందులోంచి వాటిని బయటకు లాగారు.

 

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ”కెన్యా దేశంలో ఈ ఘటన జరిగింది. ఓ బురదగుంటలో చిక్కుకుని రెండు ఆడ ఏనుగులు నరకయాతన అనుభవించాయి. నీళ్లు తాగేందుకు ఓ ప్రాంతానికి వచ్చిన ఆ ఏనుగులు ప్రమాదవశాత్తు బురదగుంటలో చిక్కుకుపోయాయి. నిజానికి కరవు సాయంలో ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఎండిపోయిన మడుగులు వద్దకు వెళ్లి చిక్కుకుపోతుంటాయి. ఇక, బురదలో చిక్కుకుపోయిన ఏనుగులు నిలబడడం సాధ్యం కాక అందులో పడిపోయాయి. పైకి లేచేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో రెండు రోజులపాటు అవి అలాగే ఉండిపోయాయి. విషయం తెలుకొని, అక్కడికి చేరి ట్రాక్టర్ల సాయంతో వాటిని బయటికి లాగాము” అని రెస్క్యూ సిబ్బంది తెలియజేశారు.

అయితే, అవి బయటకు వచ్చిన తర్వాత రెండు ఏనుగులు ఆనందంతో అడవిలోకి పరుగెత్తాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ‘షెల్ట్రిక్ వైల్డ్ ట్రస్ట్’.. రెండు రోజుల తర్వాత ఏనుగులకు ఓ ‘హ్యాపీ ఎండింగ్’ లభించిందని పేర్కొంది. వైరల్ అవుతున్న ఈ వీడియోకు ఇప్పటికే వేలాది లైకులు లభించాయి. రెస్క్యూ సిబ్బందిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.