Video: Ex-Prime Minister who was murdered..Shooting on Abe's stage
mictv telugu

మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు..వీడియో ఇదిగో..

July 8, 2022

 

జపాన్ దేశపు మాజీ ప్రధాని షింజో అబే శుక్రవారం ఉదయం దారుణ హత్యకు గురైయ్యారు. అబే వేదికపై ప్రసంగిస్తుండగా గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. దాంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. ఈ ఘటనతో ప్రసంగాన్ని వింటున్న ప్రజలు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అప్రమత్తమైన అధికారులు ఘటన స్థలానికి చేరుకొని, ఓ దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు.

 

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం టోక్యోలోని నరాల నగరంలో లిబరల్ డెమొక్రిటిక్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్న ఆయన ఉన్నట్టుండి ఒక్కసారిగా కిందపడిపోయారు. ఆ సమయంలో తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. బహుశా గుర్తు తెలియని దుండగులు షింజోపై కాల్పులు జరిపి ఉంటారని మా అనుమానం. రక్తం కారుతున్న ఆయనను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఓ అనుమానితుణ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.” అని అన్నారు. అయితే, మాజీ ప్రధాని షింజోను ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో ఎలాంటి కదలికలు గాని, శ్వాసగాని ఆడటం లేదని అధికారులు తెలిపారు.