Video: Friends fighting for a wedding..Fighting wedding
mictv telugu

వీడియో:అప్పడం కోసం కొట్టుకున్న స్నేహితులు..రణరంగమైన పెళ్లి

September 1, 2022

కేరళ రాష్ట్రంలో తాజాగా ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఓవైపు పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఆనందంగా వివాహం చేసుకుంటున్నారు. మరోవైపు పెళ్లికొచ్చిన వారందరు తమ బంధువులతో పలకరింపులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్లికొడుకు స్నేహితులు చేసిన చిన్న పొరపాటు వల్ల పెళ్లి మండపమంతా రణరంగంగా మారింది. ముగ్గురికి తీవ్ర గాయాలై, ఆసుపత్రిపాలైయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.

వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని అలప్పూజ జిల్లాలోని ముట్టమ్‌ పట్టణానికి చెందిన యువతి, త్రికూనప్పూజకు చెందిన యువకుడికి రెండు రోజులు కిందట ఓ కళ్యాణ మండపంలో వీరి వివాహం జరిగింది. వివాహతంతు ముగిసిన తర్వాత విందు మొదలైంది. వధువు కుటుంబం విందును ఏర్పాటు చేయడంతో వరుడి తరఫువారు భోజనాలు చేస్తున్నారు. ఈ సమయంలో తనకు పాపడ్ (అప్పడం) కావాలని వరుడి స్నేహితుడు అడిగితే, వధువు తరపువారు ససేమిరా అన్నారు.

దాంతో మాట మాట పెరిగి, తీవ్ర ఘర్షణకు దారితీసింది. విషయం తెలుకున్న కళ్యాణ మండపం యజమాని మురళీధరన్.. అక్కడకు చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అప్పటికే సహనం కోల్పోయిన ఇరువర్గాలు, ఆయనపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆయన తలకు గాయమై, ఆస్పత్రిలో చేరారు.

అనంతరం బాధితుడు మురళీధరన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు 15 మందిపై కేసు నమోదు చేశారు. గొడవ కారణంగా కుర్చీలు, టేబుళ్లు, ఇతర సామాగ్రీ ధ్వంసమై రూ.1.50 లక్షలు నష్టం వాటిళ్లిందని యజమాని వాపోయాడు. దాంతో నష్టానికి కారణమైన వరుడి స్నేహితులను డబ్బులు చెల్లించాల్సిందిగా పెళ్లి పెద్దలు చెప్పారు.