Video: He is moving peanuts with his nose..Do you know why?
mictv telugu

వీడియో: ముక్కుతో వేరుశనగను తరలిస్తున్నాడు..ఎందుకో తెలుసా?

July 14, 2022

అమెరికా దేశం కొలరాడో ప్రాంతంలో ఉన్నా పైక్స్ కొండపైకి 53 ఏళ్ల బాబ్ సలేం అనే వ్యక్తి వేరుశనగను ముక్కుతో తరలిస్తున్నాడు. అంతేకాదు, ఎందుకిలా ఈ వయసులో ఇలాంటి సాహసం చేస్తున్నావు అని అడిగితే ఇలాంటివి చెయ్యడం తనకు చాలా ఇష్టమని చెబుతున్నాడు. బాబ్ సలేం…జులై 9, 2022న పల్లీని చేత్తో ముట్టుకోకుండా, బల్లిలా నేలపై వాలి ముక్కుతో దాన్ని తొయ్యాటం మొదలుపెట్టాడట. మరి ఎందుకలా చేస్తున్నాడోనని గట్టిగా అడిగితే అసలు విషయం చెప్పాడు.

వివరాల్లోకి వెళ్తే..అమెరికా దేశానికి చెందిన బాబ్ సలేం తన ముక్కుతో వేరుశనగను తరలించటం మొదలుపెట్టాడు. ఇందుకోసం అతను ముక్కుకి టేపుతో కర్ర లాంటిది సెట్ చేసుకొని, దాంతో వేరుశనగను కొండపైకి పైకి నెడుతున్నాడు. ఆ కొండపైకి వెళ్లేందుకు అతడు ఒక్కొక్క మెట్టును ఎక్కుతున్నాడు. ఎందుకిలా ఈ ఛాలెంజ్‌ని చేస్తున్నావు అనే అడిగితే.. తన సిటీ మానిటౌ స్ప్రింగ్స్ 150వ వార్షికోత్సవం సందర్భంగా ఈ పని చేస్తున్నాడని చెప్పాడు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది.

ఇక, మన దేశంలో అయితే, ఆలయాల్లో కొంతమంది భక్తులు మోకాళ్లతో మెట్లు ఎక్కుతూ, దైవ దర్శనానికి వెళ్తారు. ఇంకొందరు ఆలయ మాఢవీధుల్లో దొర్లుతూ పూజలు చేస్తారు. ఇవన్నీ దేవుడి మొక్కుల చెల్లింపులో భాగంగా చేస్తుంటారు. అలా తమ భక్తిభావాన్ని చాటుకుంటారు. కానీ, 53 ఏళ్ల బాబ్ సలేం మాత్రం తన సిటీ మానిటౌ స్ప్రింగ్స్ 150వ వార్షికోత్సవం సందర్భంగా ఈ పని చేస్తుండటం సంచలనంగా మారింది.

అయితే, ఆ కొండ ఎత్తు దాదాపు 14,115 అడుగుల ఎత్తు ఉందంట, అంటే దాదాపు 20 కిలోమీటర్ల దూరం. ఆ కొండను ఎక్కటం కోసం అతను జులై 9, 2022న మొదలుపెట్టి, తాజాగా సగం దూరం చేరుకున్నారట. ఈ వీడియోను వీక్షిస్తున్న నెటిజన్లు ఆశ్చర్యానికి గురౌతున్నారు. ఇటువంటి వ్యక్తిని ఎక్కడా చూడాలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలస్యం ఎందుకు మీరు కూడా చూసేయండి.