Video leak from Ravi Teja's movie before its release
mictv telugu

రిలీజ్‌కు ముందే రవితేజ సినిమా నుంచి వీడియో లీక్

July 28, 2022

 Video leak from Ravi Teja's movie before its release

మాస్ మహరాజా రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రం ఈ నెల 29న (శుక్ర‌వారం) విడుదల కావాల్సి ఉంది. అయితే విడుదల‌కు ఒక్క రోజు ముందుగా సినిమాలోని ఓ వీడియో లీక్ అయింది. 20సెకన్లు ఉన్న ఈ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.ఈ వీడియోలో విలన్లుగా వార్నింగ్ ఇచ్చారు ర‌వితేజ‌. “మీరో ఎవరో ఏ పార్టీయో నాకు అనవసరం. ఎవరైనా సరే అధికారంలో ఉన్నాం కదా అని.. కొండలు తవ్వేస్తాం, చెరువులు పూడ్చేస్తాం, అడ్డంగా భూములు కొట్టెస్తాం, దౌర్జన్యం చేస్తాం అనుకుంటే .. ఔట్” అంటూ రవితేజ డైలాగ్ చెబుతున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో బిట్ బ‌య‌ట‌కు వ‌చ్చినంత‌నే లీకేజీని ప‌సిగ‌ట్టిన చిత్ర యూనిట్ ఘ‌ట‌న‌పై ఆరా మొద‌లెట్టింది. ఎడిటింగ్ రూం నుంచే ఈ బిట్ లీకై ఉంటుంద‌ని భావిస్తోంది.

ఈ చిత్రాన్ని శర‌త్ మండ‌వ తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభుత్వాధికారి అయిన ఎమ్మార్వో రామారావు పాత్రలో రవితేజ నటించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. నిజాయితీ గల ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో ఇరగదీసాడని సెన్సార్ వాళ్లు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో ఒక ప్రభుత్వాధికారి పాత్రను పాజిటివ్‌గా చూపించడం బాగుందున్నారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అవినీతిని, కుట్రలు, కుతంత్రాలను హీరో ఎలా ఫేస్ చేసాడనేది చక్కగా పిక్చరైజ్ చేసినట్టు సెన్సార్ వాళ్లు చెప్పిన ఇన్నర్ టాక్.