Video: Meeting with Putin
mictv telugu

వీడియో: పుతిన్‌తో భేటీ..తిప్పలు పడ్డ ప్రధాని

September 16, 2022

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంటే తెలియని వారుండరు. ప్రపంచ దేశాలు యుద్ధం వద్దు-శాంతే ముద్దు అని ఎంత వేడుకున్న యుద్ధం ప్రకటించి, అన్ని దేశాల మీడియా సంస్థల్లో పుతిన్ వార్తల్లో నిలిచారు. తాజాగా ఉజ్బెకిస్థాన్‌లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ నానా అవస్థలు పడ్డారు. ఆ ఘటనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

 

వీడియోలో..”పాక్ ప్రధాని ప్రధాని షాబాజ్ షరీఫ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ అయ్యారు. భేటీలో చర్చలు ప్రారంభించడానికి ముందు పుతిన్ తన చెవిలో ఇయర్ ఫోన్స్ వంటి పరికరాన్ని పెట్టుకున్నారు. ఆ పరికరాన్ని పెట్టుకోవడానికి పాక్ ప్రధాని షరీఫ్ మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు. ఎవరైనా వచ్చి సహాయం చేయండని, తన సిబ్బందిని పిలిచారు. సహాయకుడు వచ్చి పరికరాన్ని అమర్చారు. కానీ, వెంటనే ఆ పరికరం ఊడి పడిపోయింది. దీంతో సహాయకుడు మరోసారి వచ్చి పరికరాన్ని అమర్చారు. పాక్ ప్రధాని అవస్థను చూస్తున్న పుతిన్..లోలోపల నవ్వుకున్నారు. ”

అనంతరం పుతిన్ మాట్లాడుతూ..’పాకిస్థాన్‌, రష్యా మధ్య మౌలిక సదుపాయాలు ఇప్పటికే ఉన్నందు వల్ల గ్యాస్ సరఫరాకు సరఫరా చేస్తాం. రష్యా, కజకిస్ఠాన్, ఉజ్బెకిస్థాన్‌లలో మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఇక ఆఫ్ఘనిస్థాన్ సమస్యను పరిష్కరించుకోవలసి ఉంది’ అని ఆయన అన్నారు. అయితే, ఈ వీడియోని పాకిస్తాన్‌కు చెందిన పీటీఐ పార్టీ నేత షిరీన్ మాజారీ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.