Video: Nurse Beats Men For Making Video Of Mismanagement In Bihar Hospital Nurse
mictv telugu

ఆ వీడియో తీసినందుకు.. హాస్పిటల్‌లో తలుపులేసి కొట్టిన నర్సు

October 19, 2022

ఆ ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితులపై వీడియో తీసిన ఇద్దరు యువకులను గదిలోకి లాక్కెళ్లి మరీ కర్రలతో తీవ్రంగా కొట్టారు ఆస్పత్రి నర్సులు. దెబ్బలు తాళలేక ఓ యువకుడు బోరున ఏడ్చేశాడు. కొట్టొద్దని ప్రాధేయపడ్డప్పటికీ.. నర్సు ఏమాత్రం కనికరించలేదు. ఈ సంఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. నివేదికల ప్రకారం… బిహార్‌లోని సరన్‌ జిల్లా ఛప్రా ఆసుపత్రికి మెడికల్‌ సర్టిఫికెట్‌ కోసం ఇద్దరు యువకులు వెళ్లారు. అయితే ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితులపై తమ ఫోన్లలో వీడియో తీశారు. ఇది గమనించిన ఇద్దరు నర్సులు.. వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

ఆసుపత్రి సిబ్బంది వచ్చి ఇద్దరు యువకులను ఓ గదిలో బంధించారు. ఏం వీడియో తీశారని, వీడియో డిలీట్ చేయాలని నర్సులు వారిని బెదిరించారు. వీడియో డిలీట్ చేయకపోవడంతో యువకులను కర్రలతో కొట్టారు. ఓ యువకుడిని అయితే మరీ దారుణంగా బాదింది ఓ నర్సు. దెబ్బలు తాళలేక అతడు బోరున ఏడ్చేశాడు. కొట్టొద్దని ప్రాధేయపడ్డప్పటికీ.. నర్సు ఇంకా ఎక్కువగా బాదింది. దాంతో యువకుడు కిందపడిపోయాడు. యువకులను ఇద్దరు నర్సులు 4 గంటల పాటు చావబాదారట. నర్సుల పేర్లు పూజ, సాక్షిగా సమాచారం తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను సౌరభ్ బహుగుణ అనే వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీహార్ పోలీస్, బిహార్‌ ఆరోగ్య శాఖకు వీడియోను ట్యాగ్‌ చేశాడు. పలువురు నెటిజన్లు ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అదేసమయంలో మరికొందరు నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఆ యువకులు నర్సులతో అసభ్యంగా ప్రవర్తించారని, ఆసుపత్రి సిబ్బంది చేసింది కరక్టేనని పేర్కొన్నారు.