రోడ్డు ప్రమాదాలు బారిన వందల మంది ప్రాణాలు కోల్పోతున్నా కొందరి యువకుల్లో మాత్రం మార్పు రావడం లేదు. సమాజంపై బాధ్యతగా వ్యవహరించాల్సిన యువత నిర్లక్ష్యంగా వ్యహరిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రధానంగా వాహనాలు నడిపే విషయంలో మాత్రం కోతి పనులు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్నాయి. ఇలాంటి వారిపై పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. దొరికితే దొంగ లేకపోతే రాజు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. బైక్ రేసులు, స్టంట్స్‌తో సోషల్ మీడియాలో లైకులు కోసం కూడా ఎగబడుతున్నారు. ట్రాఫిక్ రద్దీ ఏరియాలో ప్రమాదకర బైక్ విన్యాసాలు చేస్తున్నారు.
14 men perform stunt on 3 bikes in UP’s Bareilly, Land in Trouble after Video goes viral#bikestunt #Bareilly #nainital #UttarPradesh #Bikedangerousstunt pic.twitter.com/TyuK9BRX4V
— India.com (@indiacom) January 11, 2023
విన్యాసాలతో వాహనదారులకు ఇబ్బందులు పెడుతున్న పోకిరీలు.. తమ ప్రాణాలతో పాటు సామాన్యుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. అంతే కాదు ఎవరికీ దొరకకుండా నంబర్ ప్లేట్ తొలిగించి రోడ్లపై సర్కస్ ఫీట్లు చేస్తున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ బరేలీలో యువకులు రోడ్డుపై హల్చల్ చేశారు. కేవలం మూడు బైక్‌లపై 14 మంది ప్రమాదకరంగా ప్రయాణించారు. ఒక బైక్‌పై అయితే ఏకంగా ఆరుగురు కూర్చుకున్నారు .మరో రెండు బైకులపై నలుగురేసి ఉన్నారు. ఈ వీడియోను కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది పోలీసుల దృష్టికి చేరింది. బైక్ నెంబర్లు, ఫోటోలు ఆధారంగా యువకులను పోలీసులు గుర్తించి మూడు బైక్‌లను సీజ్ చేశారు.