ఈ చేప వయసు వందేళ్లు, పొడవు పదడుగులు.. ఒళ్లు జలదరించే వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

ఈ చేప వయసు వందేళ్లు, పొడవు పదడుగులు.. ఒళ్లు జలదరించే వీడియో

April 14, 2022

21

ప్రకృతిలో మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఇప్పుడు మనం వీడియోలో చూడబోయే భారీ చేప ఒకటి. దాదాపు 250 నుంచి 280 కిలోల వరకు బరువున్నట్టు భావిస్తున్న ఈ చేప పది అడుగుల పొడువుంటుంది. ఇంత సైజు, భారీ బరువున్న చేప నార్త్ అమెరికాలోని ఫ్రేజర్ నదిలో కంటపడింది. దీని వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ భయంకర చేప రూపం చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. వీటిని స్టర్జన్ ఫిష్ అంటారని, ఈ చేప వయసు వంద సంవత్సరాల కంటే ఎక్కువే ఉంటుందని ఒక అంచనా. నిపుణులు వీటిని బతికున్న డైనోసార్స్ అని వర్ణిస్తున్నారు.