యువతితో మాజీ మంత్రి రాసలీలల వీడియో వచ్చేసింది - MicTv.in - Telugu News
mictv telugu

యువతితో మాజీ మంత్రి రాసలీలల వీడియో వచ్చేసింది

June 3, 2022

గుజరాత్ మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి భరత్ సోలంకి తన వయసులో సగం కూడా లేని యువతితో రాసలీలలు సాగిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఆయన భార్య రేష్మా పటేల్ స్వయంగా పట్టుకొని తతంగాన్నంతా వీడియో రికార్డు చేసింది. ఈ విషయాన్ని బుధవారం మైక్ టీవీలో వార్తా కథనం వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు భరత్ సోలంకి దాడి ద‌ృష్యాలు బయటికి వచ్చాయి. అందులో డోర్ తెరచి రూంలోకి ప్రవేశించిన రేష్మా.. తన భర్తతో ఉన్న యువతిని జుట్టు పట్టుకొని కొట్టింది. తన భర్త అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆమె వెనక్కి తగ్గలేదు. తన భర్తతో ఉన్న నిన్ను వదిలిపెట్టను అంటూ గట్టిగా అరస్తూ తన భర్తను కూడా లెక్క చేయలేదు. రేష్మ దాడి సమయంలో భర్త భరత్ సోలంకి ఆమెను ఆపుతూ కావాలంటే కేసు పెట్టుకో కానీ, సదరు యువతిని మాత్రం కొట్టకు అంటూ ఆపే ప్రయత్నం చేశాడు. కాగా, ఈ ఘటనతో ఇప్పటికే మంత్రి పరువు చాలా వరకు పోయింది. వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు మాజీ మంత్రిని తీవ్రంగా తప్పుపడుతూ విమర్శిస్తున్నారు. అంతేకాక, కాంగ్రెస్ పార్టీని ఏకి పారేస్తున్నారు.