ఎంత బోర్ కొడితే మాత్రం.. 13వ అంతస్తుపై (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

ఎంత బోర్ కొడితే మాత్రం.. 13వ అంతస్తుపై (వీడియో)

August 12, 2020

Video of a Girl Walking on Ledge of High-Rise Apartment Goes Viral.

లాక్ డౌన్ కారణంగా గత నాలుగు నెలలుగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ప్రభుత్వం అన్ లాక్ ప్రక్రియ మొదలు పెట్టినప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎక్కువగా బయటికి రావడం లేదు. ఇంట్లో ఉండి కాలక్షేపం కోసం సినిమాలు చూస్తున్నారు. ఇష్టమైన వంటకాలు చేసుకుని తింటున్నారు. కొందరు తమ కళలను ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో త‌మిళ‌నాడు రాజధాని చెన్నైకి చెందిన అన్నా చెల్లెళ్లు తమ ధైర్య సాహసాలను నిరూపించుకోవడానికి ప్రాణాలతో చెలగాటం ఆడారు.

ఆగ‌స్టు 6న‌ చెన్నై స‌మీపంలోని కేళంబ‌క్క‌మ్‌లో జరిగిన ఈ సంఘటన ఆల‌స్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాంతానికి చెందిన ఓ ప‌ద్నాలుగేళ్ల బాలిక‌ 23వ అంత‌స్థు కొన నుంచి మూడుసార్లు న‌డిచింది. ఆమె అలా నడుస్తుంటే కొందరు తమ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేయగా అదికాస్తా వైర‌ల్ అయింది. ఏమాత్రం కాలు జారినా ప‌రిస్థితి ఘోరంగా ఉండేద‌ని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో పోలీసులకు చేరడంతో ఆ మైన‌ర్ బాలిక‌ను, ఆమె సోద‌రుడిని హెచ్చ‌రించి వ‌దిలేశారు.