పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ తండ్రిలాగే బాక్సింగు, మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతున్నాడు. ఇవాళ అకీరా పుట్టినరోజు సందర్భంగా బాక్సింగ్ చేస్తున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. వీడియోలో అకీరా తన ట్రైనర్‌తో కలిసి సాధన చేస్తున్నాడు. జాబ్, రైట్ హుక్ వంటి షాట్ల కాంబినేషన్‌తో పంచ్‌లు విసురుతున్నాడు. గతంలో పవన్ కల్యాణ్ అనేక రకాల మార్షల్ ఆర్ట్స్ విద్యలు నేర్చుకున్నారు. ఐకిడో, వుషు వంటి పోరాట విద్యలను తన సినిమాల ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇప్పుడు కొడుకు కూడా అదే బాటలో నడుస్తుండడంతో పవన్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. తండ్రికి తగ్గ వారసుడని కొనియాడుతున్నారు. కాగా, పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్‌ల మొదటి సంతానమైన అకీరా.. తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత తల్లి దగ్గరే ఉంటున్నాడు.