భార్య ముద్దుతో కోహ్లీ కూల్ (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

భార్య ముద్దుతో కోహ్లీ కూల్ (వీడియో)

September 13, 2019

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేతికి అతని భార్య అనుష్క శర్మ ముద్దు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వీడియోలో కోహ్లీ చాలా ఎమోషనల్‌గా కనిపిస్తున్నాడు. అప్పుడే అతని చేయిని లాక్కుని అనుష్క ముద్దు పెట్టింది. దీంతో కోహ్లీ స్వాంతన లభించినట్టు ఆమె చేతిని నిమిరాడు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో వీరిద్దరు ఇలా కనిపించారు. ఇటీవలే ఆ స్టేడియానికి అరుణ్ జైట్లీ పేరు పెట్టిన విషయం తెలిసిందే. అలాగే ఒక స్టాండ్‌కి విరాట్ పేరును పెట్టారు. ఈ కార్యక్రమానికి కోహ్లీ జంటగా హాజరయ్యాడు. 

కార్యక్రమంలో డీడీసీఏ అధ్యక్షుడు రజత్ శర్మ, కోహ్లీ గురించి అర్జున్ జైట్లీ చెప్పిన కొన్ని మాటలను గుర్తు చేసుకున్నారు. ‘తండ్రి మరణించిన సమయంలో కూడా దేశం కోసం ఆడడానికి కోహ్లీ వెళ్లినట్లు అర్జు  జైట్లీ చెబుతుండేవారు. అంతే కాకుండా కోహ్లీ కంటే గొప్ప ఆటగాడు ప్రపంచంలోనే లేడని కూడా అంటుండేవారు’ అని రజత్ శర్మ మాట్లాడారు. ఆయన మాటలు వింటున్న కోహ్లీ చాలా ఎమోషనల్ అయ్యాడు. అతని పక్కనే కూర్చున్న అనుష్క అతని చేతిని లాక్కుని ముద్దు పెట్టింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

తాను ఫామ్ కోల్పోయినప్పుడు, కెరీర్ అపజయాలతో సతమతమైనప్పుడు ఎల్లవేళలా తనకు తోడుగా అనుష్క ఉంటుందని చాలా సార్లు కోహ్లీ చెప్పడం విన్నాం. ఆమాటను అనుష్క నిజం చేసి చూపించారని వారి అభిమానులు కామెంట్లలో తెలుపుతున్నారు. విరుష్క జంట పర్ఫెక్ట్ కాంబో అని చెబుతున్నారు. ఇదిలావుండగా ఆదివారం సౌత్ ఆఫ్రికాతో జరగనునున్న టీ20 సిరీస్‌లో కోహ్లీ ఆడనున్నాడు.