కుక్క.. మనుషుల బెస్ట్ ఫ్రెండ్ అంటారు. జంతువులలో మనుషులను అర్థం చేసుకోవడంలో కుక్కలు మొదటి స్థానంలో ఉంటాయి. తమ యజమానులు కోసం కుక్కలు ప్రాణాలు పణంగా పెట్టిన సంఘటనలు ఎన్నో జరిగాయి. యజమానులు బాధగా ఉంటే కుక్కలు యిట్టె పసికడుతాయి. వాళ్ల బాధను పోగొట్టడానికి ప్రయత్నిస్తాయి. కుళ్ళలో ఆడుకుంటే మనుషులకు మంచి కాలక్షేపం అవుతుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ కుక్క వీడియో వైరల్ అవుతోంది.
బెల్జియన్ మాలినోయిస్ రకానికి చెందిన ‘మంకీ’ అనే ఓ కుక్క.. చిన్నారితో కలిసి దాగుడు మూతలు ఆట ఆడటం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. జీఎస్డీ ఫ్రెండ్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోలో ఆ కుక్క మనుషుల్లాగానే గోడ వైపు తిరిగి కళ్లు మూసుకుంది. ఆమె దాక్కోడానికి వెళ్లడంతో కదలకుండా అక్కడే నిలుచుంది. ఆమె రెడీ అని చెప్పగానే కళ్లు తెరిచి.. ఆమెను వెతకేందుకు పరుగు పెట్టింది.