Video Of Machine Gun Strapped To Dog Shocks Internet:
mictv telugu

రోబోటిక్ డాగ్ ఫైరింగ్.. ఓనర్లు ఈజీగా తప్పించుకోవచ్చని నెటిజన్ల సెటైర్లు

July 22, 2022

Video Of Machine Gun Strapped To Dog Shocks Internet:

ఓ రోబోటిక్ డాగ్ కాపలా కాస్తూ, ఆటోమేటిక్ మెషిన్ గన్‌ తో కాల్పులు జరుపుతున్నట్లు కనిపిస్తున్న వీడియో ఇంటర్నెట్‌ను వణికిస్తోంది. ఇంట్లోకి దొంగలు చొరబడకుండా ఉండేలా వారిని భయపెట్టేలా కాల్పులు జరుపుతుంటుంది. ఈ రోబో డాగ్‌ని రష్యకు చెందిన అలెగ్జాండర్ ఆటామానోవ్‌ రూపొందించాడు. అతను ‘హోవర్‌సర్ఫ్‌’ అనే ఏరోపరిశ్రమ వ్యవస్థాపకుడు. అతని కంపెనీ కాలిఫోర్నియాలోని శాస్‌జోస్‌లో ఉంది. అంతేకాదు అతను ఈ రోబో ఎలా తన లక్ష్యాన్ని ఏర్పరుచుకుని కాల్పులు జరుపుతుందో కూడా వివరించారు.

ఈ రోబో డాగ్‌ పై అమర్చిన తుపాకీ రష్యన్ – PP-19 విత్యాజ్, AK-74 డిజైన్ ఆధారంగా రూపొందించారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది. ఐతే నెటిజన్లు మాత్రం ఇలాంటి రోబోలు అవసరమా అని ప్రశ్నిస్తూ..ట్వీట్‌ చేశారు. ఇలాంటి రోబోలు మనుషులపై దాడులు చేస్తే యజమానులు నేరం నుంచి సులభంగా తప్పించుకునే అవకాశం ఉందంటున్నారు. ఇటువంటి దానిని ధ్వంసం చేయడం, పని చేయకుండా చేయడం అతి పెద్ద ఫెడరల్ నేరమని కేసు పెడతారన్నారు.