ఆటోలో 24 మందిని తలదన్నారు.. బైకుపై ఎంతమందంటే..
రోడ్డు ప్రమాదాలకు వారివారి నిర్లక్ష్యమే ప్రధాన కారణం అని ట్రాఫిక్ పోలీసులు ఎంత మొత్తుకున్నా పట్టించుకుంటున్నవారు ఎంతమంది? తాగి డ్రైవింగ్ చేయొద్దు, హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పినిసరి, వాహనం నడుపుతూ హెడ్‌ఫోన్స్ ధరించరాదు, వాహనాన్ని మించి మనుషులు కూర్చోవద్దు, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి.., వంటి రూల్స్ ఎన్ని చెప్పినా పట్టించుకంటున్నావారు చాలా తక్కువ అనే తెలుస్తోంది. మొన్నటికి మొన్న ఒకే ఆటోలో 24 మంది కూర్చున్నారు. దాని గురించి మరిచిపోకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడుగురు కుటుంబ సభ్యులు, బ్యాగులు, కుక్క, కోడి ఇలా అందరూ ఒకే బైక్‌పై ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
Only in India! pic.twitter.com/1ZvKLVvaZp
— Rishad Cooper (@rishadcooper) August 29, 2019
ఒకే బైక్‌పై భార్య, భర్త, ఐదుగురు పిల్లలు కలసి ప్రయాణించారు. వారితో పాటు సరంజామా మొత్తం వుంది. రెండు కుక్కలు సహా కోడి కూడా వుంది. బ్యాగులు అన్నీ బైకుకు చుట్టూతా తగిలించారు. వీలులేని చోట కట్టారు. చిన్న పిల్లలను భార్య తీసుకుని ఇరుగ్గా కూర్చుంది. భర్త ఆ బైకును తోలుతున్నాడు. దాన్ని వెనకనుంచి చూస్తే బ్యాగులతో నాలుగు చక్రాల వాహనం మాదిరి వెడల్పుగా కనిపిస్తోంది. బైక్ నడుపుతున్న అతను హెల్మెట్ కూడా ధరించలేదు. వారి వెనుకగా వెళుతున్న మరో వ్యక్తి ఈ ఉదంతాన్ని వీడియో తీసి ట్విటర్‌లో పెట్టాడు. ఇటువంటివి ఇండియాలో మాత్రమే జరుగాతాయి అంటూ ఓ క్యాప్షన్ కూడా జతచేశాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
దీనిపై చాలామంది స్పందిస్తున్నారు. వారు సంచారజీవుల్లా వున్నారు. వారి పొట్టతిప్పల కోసం పాట్లు పడుతున్నారని కామెంట్లు చేస్తున్నారు. పేదవాళ్లు మాత్రమే ఇలా కష్టాల్లో కూడా కలిసుండగలరని కొందరు సమర్థిస్తున్నారు. మరికొంత మంది ఇటువంటి సహాసాలు ప్రమాదానికి దారి తీస్తాయని.. బస్సుల్లో వెళ్లొచ్చు కదా అని చెబుతున్నారు.