కూర్చున్న చెట్టునే నరుక్కున్నాడు.. వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

కూర్చున్న చెట్టునే నరుక్కున్నాడు.. వీడియో

September 26, 2020

Video of Man Cutting Palm Tree goes viral

తాను కూచున్న కొమ్మను తానే నరుక్కున్నాడు అనేది సామెత. ఎవరైనా తనంతట తాను అపాయంలో పడితే ఈ సామెతను వినియోగిస్తారు. ఈ సామెతకు తగ్గట్టుగా ఉన్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి తాను కూచున్న కొమ్మను తానే నరుక్కున్నాడు.

ఓ వ్యక్తి మొదట తాటిచెట్టు ఎక్కాడు. రంపంతో దాని పైభాగాన్ని కట్‌ చేశాడు. ఆ సమయంలో చెట్టు చాలావరకు కిందికి వంగింది. దానిపైభాగం తెగి కిందపడగానే అతడు కాండాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అది అలా కొంచెంసేపు గాల్లోనే ఉండిపోయింది. ఈ వీడియోను ఇప్పటివరకు 42 లక్షల మంది నెటిజన్లు వీక్షించారు.