ఈ లోకం అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. ప్రయత్నిస్తూ ఏదైనా సాధ్యమే. ఈ విషయాన్నే నిజం చేస్తూ వికలాంగుడైన వ్యక్తి.. తన మనోధైర్యం కోల్పోకుండా ఉపాధి కోసం ఎవరి కాళ్ల మీద పడకుండా తనకు తోచిన ఉద్యోగాన్ని చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. Zomato డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న ఓ వికలాంగుడు.. వీల్ చైర్ నడుపుకుంటూ ఫుడ్ ఆర్డర్స్ డెలివరీ చేస్తున్నాడు. ఈ వీడియోని ఎవరో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన వారంతా అతడి ఆత్మస్థైర్యానికి సెల్యూట్ చేస్తున్నారు. వికలాంగుడైనప్పటికీ, మనోధైర్యాన్ని కోల్పోకుండా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. కుటుంబ పోషణకు తనవంతు సహాయంగా నిలిస్తున్నాడు.
వీల్‌చైర్‌లో మోటారు ఉండడంతో ఆ వ్యక్తి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి సౌకర్యవంతంగా చేరుకుంటున్నాడు. ఇప్పటి వరకు సైకిల్, బైక్‌పై మాత్రమే ఫుడ్ డెలివరీ చేయడం చూశాం. ఇప్పుడు ఈ వీల్‌చైర్ ఫుడ్ డెలివరీ ఏజెంట్‌ను చూసిన ప్రజలు శభాష్ అంటున్నారు. ఎంతోమంది అతడిని ప్రశంసిస్తూ, కామెంట్లు చేస్తున్నారు.