Home > Featured > లంచగొండి మహిళా తహశీల్దార్ వీడియో వైరల్

లంచగొండి మహిళా తహశీల్దార్ వీడియో వైరల్

ప్రభుత్వ అధికారులు కొందరు లంచాలు తీసుకోవడం ఇంకా మానలేదు. అవసరం కోసం వచ్చిన బాధితులను.. ‘ఈ పనికి.. ఇంత’ అంటూ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఐదు వేల రూపాయలు ఇస్తానని చెప్పి వెయ్యి రూపాయలే తెస్తావా అంటూ ఓ రైతుపై మహిళా ఎమ్మార్వో అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ‘ఏమయ్యా.. నువ్వు ఆ రోజు ఏం చెప్పినావయ్యా.. 5000 ఇస్తానని చెప్పి పొయ్యి, వెయ్యి రూపాయలు తెచ్చి ఇస్తావా?’ అంటూ ఆ రైతుపై విసుకున్నారు ఆ తహశీల్దార్. మిగిలినవి కూడా పక్కన ఇచ్చి పని చేసుకో పో..’ అంటూ విసుగ్గా కాగితాలను విసిరేయడం వీడియోలో కనిపిస్తోంది.

పెనుమూరు మండలం కలవకుంట గ్రామ పంచాయతీ పరిధిలోని పూనేపల్లికి చెందిన రైతు సయ్యద్.. తనకున్న వ్యవసాయ భూమిని వాణిజ్య భూమిగా మార్పు చేసుకునేందుకు ఎమ్మార్వో ఆఫీస్‌లో అప్లై చేసుకున్నాడు. అయితే, రూ. 5 వేలు ఇస్తేనే, ధ్రువీకరణ పత్రం జారీ చేస్తామని ఎమ్మార్వో రమణి చెప్పినట్లు తెలిపాడు సయ్యద్. అందుకు అంగీకరించిన సయ్యద్‌కు ఆ మొత్తం సర్దుబాటుకాకపోవడంతో, మళ్లీ తిరిగి ఎమ్మార్వో ఆఫీక్ వచ్చాడు. రూ. 5 వేలు సర్దుబాటు కాలేదని ఎమ్మార్వోను విజ్ఞప్తి చేయగా.. అందుకు ఆమె అసహనంతో..‘ ఏందయ్యా.. మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి’ అంటూ నిట్టూర్చారు.

Updated : 16 Nov 2022 2:56 AM GMT
Tags:    
Next Story
Share it
Top