Home > Featured > వీడియో: దూసుకొచ్చిన రైలు..పట్టాలపై పడిన బైక్, చివరికి..

వీడియో: దూసుకొచ్చిన రైలు..పట్టాలపై పడిన బైక్, చివరికి..

దేశవ్యాప్తంగా ఏ చిన్న సంఘటన జరిగిన ఆ సంఘటన సోషల్ మీడియా ద్వారా క్షణాల్లోనే ప్రజలకు చేరుతుంది. ఆ సంఘటనల్లో ఉన్న విషయాలు ప్రజలకు ఊపయోగకరంగా ఉంటే, నెటిజన్స్ వెంటనే వాటిని షేర్లు చేయటం, ఆ సంఘటనలపై అభిప్రాయాలను తెలియజేయటం చేస్తుంటారు.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో తాజాగా జరిగిన ఓ ఆసక్తికర సంఘటన నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వీడియోలో జరిగిన సంఘటన ఎక్కడ జరిగింది? అనే పూర్తి వివరాలు అయితే స్పష్టంగా తెలియవు గానీ, వీడియోను వీక్షిస్తున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. 'క్షణం ఆలస్యం అయ్యి ఉంటే నీ ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి కదా' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఆ వీడియోలో.."రైల్వే గేటు వేసి ఉన్నప్పటికి వాహనదారులు మాత్రం రైలు పట్టాలను దాటుతున్నారు. ఒక బైకర్ కూడా రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. అంతలోనే రైలు వేగంగా దూసుకొస్తుంది. దాంతో ఆ బైక్‌ర్ అతడి బైక్‌ను పట్టాలపై నుంచి తప్పిస్తుండగా, రైలు పదే పదే హారన్ కొడుతూ ఇంకొంచెం వేగంగా దూసుకొచ్చింది. దాంతో చేసేది ఏమీలేక ఆ వ్యక్తి బైక్‌ను పట్టాల మీద వదిలేసి, క్షణంలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అందరూ చూస్తుండగానే అతడి బైక్ నుజ్జునుజ్జు అయిపోయింది".

Updated : 30 Aug 2022 5:31 AM GMT
Tags:    
Next Story
Share it
Top