భార్యకు ముద్దు పెట్డాడని..చితకబాదిన జనం - MicTv.in - Telugu News
mictv telugu

భార్యకు ముద్దు పెట్డాడని..చితకబాదిన జనం

June 23, 2022

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది వ్యక్తులు నదీలో స్నానం చేస్తున్న ఓ వ్యక్తిని నది బయటికి లాగి చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. అయితే, వీడియోను వీక్షిస్తున్న వారంతా ఎందుకు అతడిని కొడుతున్నారు? ఏం తప్పు చేశాడు? అనే సందేహాలతో తెగ ఆరా తీస్తున్నారు. నదీలో స్నానం చేస్తుండగా ఆ వ్యక్తి తన భార్యకు ముద్దు పెట్టాడట. దాంతో ఆ నదిలో స్నానం చేస్తున్న కొంతమంది వ్యక్తులు దేవుడి దర్శనం నిమిత్తం పవిత్ర నదీలో స్నానం చేస్తూ, భార్యకు ముద్దులు పెడతావా అంటూ అతడిని చితకబాదారట.

 

వివరాల్లోకి వెళ్తే.. ”ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో సరయూ నదిలో ఓ జంట నీళ్లలోకి దిగింది. అందరు చూస్తుండగానే భర్త తన భార్యకు ముద్దు పెట్టాడు. ఈ వ్యవహారాన్ని అక్కడున్న వ్యక్తులు తమ ఫోన్లలో రికార్డు చేశారు. అనంతరం కొందరు అతడిపై తీవ్రంగా మండిపడుతూ, బయటకు లాగేసి చెయ్యి చేసుకున్నారు. ‘ఇది పవిత్రమైన నేల. అయోధ్యలో ఇలాంటి పనులు సహించం’ అంటూ రామ భక్తుడిగా ఓ వ్యక్తి మాట్లాడడం ఆ వీడియోలో చూడొచ్చు. ఘటన ఎప్పుడు జరిగిందన్నది స్పష్టత లేదు. కానీ, ఈ వీడియో వైరల్‌ కావడంతో, పోలీసులు ఆ జంటపై చర్యలు తీసుకుంటామని చెప్పారు