Video: Please tell me the address of this child: Rashmika Mandana
mictv telugu

వీడియో: ఈ చిన్నారి అడ్రెస్ చెప్పండి ప్లీజ్: రష్మిక

September 15, 2022

టాలీవుడ్‌లో ‘పుష్ప’ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్‌వుడ్ అనే తేడా లేకుండా విడుదలైన అన్ని భాషల్లో భారీ కలెక్షన్లు రాబట్టింది. అంతేకాదు, సినిమాలో ఉన్న ‘తగ్గేదేలే’ అనే డైలాగ్‌ను ఇప్పటికి అనేక సందర్భాలలో ఉపయోగిస్తూనే ఉన్నారు. ఇక, పుష్ప సినిమాలో ఉన్న పాటల గురించి అయితే చెప్పనక్కర్లేదు. చిన్నారుల నుంచి మొదలుకొని పెద్దవాళ్ల వరకు వందలాది వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. మరీ ముఖ్యంగా పుష్పలోని ‘సామి సామి’ అనే పాటకు మరిన్ని వీడియోలు వచ్చాయి. తాజాగా మరోసారి ‘సామి, సామి’ అంటూ ఓ చిన్నారి స్కూల్ డ్రైస్‌లో వేసిన డ్యాన్స్ నెట్టంట తెగ వైరల్ అవుతోంది.

 

అయితే, ఆ వీడియోలోని చిన్నారి..బొద్దుగా ఉండి, చాలా గ్రేస్‌తో డ్యాన్స్ వేస్తుంది. తనకు వచ్చిన చిన్న చిన్న స్టెప్స్‌తో అందరినీ అలరిస్తుంది. కానీ, ఆ చిన్నారి అడ్రస్ మాత్రం తెలియలేదు. ఈ క్రమంలో వీడియోను వీక్షించిన పుష్ప హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన తనదైన శైలిలో స్పందించింది.”నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ చిన్నారి డ్యాన్స్‌కు నేను కూడా ఫిదా అయ్యా. నాకు ఆ చిన్నారిని కలవాలని ఉంది.ఎవరికైనా ఆ చిన్నారి అడ్రెస్ తెలిస్తే, దయచేసి నాకు చెప్పండి ప్లీజ్” అంటూ వేడుకుంది. అంతేకాదు, తాను వేసిన డ్యాన్స్‌ను అద్భుతంగా ఇమిటేట్ చేసిన ఆ చిన్నారిపై రష్మిక మందన ప్రశంసలు కురిపించింది.

ఇక, ‘పుష్ప’ సినిమా విషయానికొస్తే..అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్‌గా డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది. దక్షిణాది భాషల్లో కంటే ఉత్తరాదిలోనే ఈ సినిమా మంచి క్రేజ్ దక్కించుకుంది. అంతేకాకుండా, ఈ సినిమాలోని అన్ని సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్‌ అటు శ్రోతలతోపాటు, సెలబ్రిటీలను కూడా ఆకట్టుకుంది.