Video: Pushups holding a helicopter..Guinness Record
mictv telugu

వీడియో: హెలికాప్టర్‌‌ను పట్టుకొని పుషప్స్..గిన్నిస్ రికార్డ్‌

August 6, 2022

నెదర్లాండ్స్‌ దేశానికి చెందిన అర్డెన్ అల్బెర్స్‌ మిత్రుడు స్టాన్ బ్రౌనీ అనే వ్యక్తి గాలిలో ఎగురుతున్న హెలికాప్టర్ నుంచి వేలాడుతూ, ఒక్క నిమిషంలో అత్యధిక పుషప్స్ చేసి వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డ్‌లో చోటు సాధించాడు. ఈ విషయాన్ని స్వయంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంస్థే ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. నెదర్లాండ్‌కు చెందిన స్టాన్ బ్రౌనీ మిత్రుడు అర్డెన్ అల్బెర్స్‌‌తో కలిసి ఫిట్నెస్‌కు సంబంధించి ఓ యూట్యూబ్ ఛానెల్‌ను నడుపుతున్నాడు. తాజాగా ఫీట్‌నెస్‌కు సంబంధించి ఓ కొత్త వీడియోను చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం కొద్దిరోజులుగా ప్రాక్టీస్ కూడా చేశారు. ఈ క్రమంలో జులై 6న బెల్జియంలోని ఆంట్వెర్స్ ఎయిర్‌ఫీల్డ్‌లో గిన్నిస్ రికార్డ్స్ అధికారుల సమక్ష్యంలో గాలిలో హెలికాప్టర్ ఉండగా, ఒక్క నిమిషంలో 25 పుషప్స్ కొట్టి, ఫీట్‌ను సాధించాడు. ఇందుకు స్టాన్ బ్రౌనీ, అర్డెన్ అల్బెర్స్ పోటీ పడగా.. బ్రౌనీ నిమిషంలో 25 పుషప్స్ చేసి రికార్డు నెలకొల్పాడు. అంతకు ముందు 23 పుషప్స్‌తో ఆర్మేనియాకు చెందిన రోమన్ సరద్యాన్ పేరిట ఉన్న రికార్డును బ్రౌనీ బద్దలు కొట్టాడు.