వీడియో : ఢిల్లీ గోడౌన్‌లో మంటలార్పుతున్న రోబో - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో : ఢిల్లీ గోడౌన్‌లో మంటలార్పుతున్న రోబో

June 26, 2022

ఢిల్లీలోని ఓ గోడౌన్‌లో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో ఓ రోబో మంటలను ఆర్పింది. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం గత నెలలో రెండు రోబోలను ఆస్ట్రేలియా నుంచి కొనుగోలు చేసింది. వాటిలోని రెడ్ రోబో ఫైర్ యాక్సిడెంటులో మంటలను ఆర్పడంలో కీలక పాత్ర పోషించింది. ఇరుకైన మార్గంలో కూడా ప్రయాణించగల ఈ రోబోలు సుమారు వంద మీటర్ల వరకు నీటిని చిమ్మగలవు. గంటకు నాలుగు కిలోమీటర్ల వేగంతో నడిచే సామర్ధ్యం ఉంది. గంటకు రెండు వేల లీటర్ల నీటిని విడుదల చేయగలదు. నావిగేషన్, సెన్సార్లు, కెమెరాలు అమర్చి ఉంటాయి. అగ్నికీలల స్థాయిని బట్టి నీటిని విడుదల చేసేలా ప్రత్యేక విభాగం కూడా ఉంది. కాగా, దీనివల్ల్ ప్రాణ నష్టం, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు.