పావురాల సంసారం.. బెంజి కారును గిఫ్ట్‌గా చేసిన ప్రిన్స్   - MicTv.in - Telugu News
mictv telugu

పావురాల సంసారం.. బెంజి కారును గిఫ్ట్‌గా చేసిన ప్రిన్స్  

August 13, 2020

VIDEO Sheikh Hamdan cordons off SUV after bird builds nest on it.

‘అరె ఈ కారు భలే ఉందే.. ఇక్కడే ఎంచక్కా గుడ్లు పెట్టి, పొదిగి పిల్లల్ని కని పెంచుకోవాలి’ అని అనుకున్నట్టుంది ఓ పావురం. దాని మొర ఆలకించిన దేవుడిలా ‘కారు కావాలా పావురమా.. అయితే తీస్కో’ అని దానికి కారును గిఫ్టుగా ఇచ్చేశాడు. మరి పావురానికి బహుమతిగా ఇచ్చిన ఆ కారు అల్లాటప్పా కారు కాదు సుమీ.. బెంజికారు. అంటే దాని విలువ ఎంతటిదో తెలిసిందే. ఆ కారును గిఫ్టుగా ఇచ్చిన మనిషి కూడా అల్లాటప్పావాడు కాదు.. దుబాయి క్రౌన్ ప్రిన్స్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమ్దన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్దుమ్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ వద్ద ఉన్న మెర్సిడెన్ ఎస్‌యూవీ కారు ఉంది. దానిని ఆయన ఎంతో అపురూపంగా చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో గ్యారేజ్‌లో ఉన్న ఆయన కారుపై ఓ పావురం పుల్లా పుల్లా పేర్చి గూడును నిర్మించుకుంది. 

 

 

View this post on Instagram

 

A post shared by Fazza (@faz3) on

అది గమనించిన ఆయన అస్సలు ఛీదరించుకోలేదు. దానిపై జాలిపడి, ఆ కారును ఉపయోగించకుండా వదిలేశారు. దీంతో ఆ పావురం కారుపై అల్లుకున్న గూడులో గుడ్లుపెట్టింది, పొదిగింది. పొచ్చెల్లోంచి పిల్లలు బయటకు వచ్చాయి. చక్కగా వాటికి ఆహారం సేకరించుకుని వచ్చి తినిపించుకుంటూ ఉంది. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఆ వీడియోలను ఎడిట్ చేసి దుబాయ్ క్రౌన్ ప్రిన్స్.. సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. నెటిజన్లను బాగా అలరిస్తోంది. రాజు మనసులో గొప్పవాడే అని కామెంట్లు చేస్తున్నారు.