Video: Sir..an unexpected guest came to the ground: KL Rahul
mictv telugu

వీడియో: సార్..గ్రౌండ్‌లోకి అనుకోని అతిథి వచ్చాడు: కేఏల్ రాహుల్

October 3, 2022

టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య గతరాత్రి రెండో టీ20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం సాధించి, సిరీస్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఓ వైపు మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుంటే, మరోవైపు ఎవరూ ఊహించని విధంగా ఓ (అతిథి) పాము గ్రౌండ్‌లో ప్రత్యక్షమై, హల్‌చల్ చేసింది. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం రాత్రి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ గువాహాటి మైదానంలో జరిగింది. భారత ఇన్నింగ్స్‌లో ఏడో ఓవర్ పూర్తయి, ఎనిమిదో ఓవర్ మొదలు కాబోతున్న సమయంలో ఓ పాము జరజరా పాకుతూ, గువాహాటి స్టేడియంలోకి వచ్చేసింది. దానిని గమనించి భారత బ్యాట్‌మెన్ కేఏల్ రాహుల్..’సార్ గ్రౌండ్‌లోకి పాము వచ్చింది చూడండి’ అంటూ అంఫైర్‌కి తెలియజేశాడు. దాంతో ఆటను కొద్దిసేపు ఆపేసి, క్రికెటర్లలంతా ఆ పాము వైపే చూస్తుండిపోయారు. అభిమానులకు కూడా ఏం జరిగిందో వెంటనే అర్థం కాలేదు.

అనంతరం మైదానంలోకి హుటాహుటిన వెళ్లిన సిబ్బంది..ఆ పామును పట్టి, బయటకు తీసుకెళ్లిపోయారు. అయితే, వీడియోను వీక్షిస్తున్న నెటిజన్స్ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ‘మైదానంలోకి కుక్కలు, పక్షులు రావడం సాధారణమే కానీ, ఇలా పాము రావడం ఇదే మొదటిసారి’ అంటూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.