వీడియో: విమానంలో పొగలు..ఉలిక్కిపడ్డ ప్రయాణికులు - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో: విమానంలో పొగలు..ఉలిక్కిపడ్డ ప్రయాణికులు

July 2, 2022

భారతదేశ రాజధాని ఢిల్లీలో తాజాగా పెను ప్రమాదం తప్పింది. దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్‌కు చెందిన ఓ విమానంలో ఐదువేల అడుగుల ఎత్తులో ఉండగా పొగలు వచ్చాయి. దాంతో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉక్కిబిక్కిరి అయ్యారు. ఏం చేయాలో అర్థంకాక పొగాతో ఊపిరాడక నానా అవస్థలు పడ్డారు. అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.

 

వివరాల్లోకి వెళ్తే..”ఈ ఉదయం ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఓ స్పైస్ జెట్ విమానం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన అనంతరం విమానం 5 వేల అడుగుల ఎత్తులో ఉండగా క్యాబిన్‌లో నుంచి పొగలు రావడాన్ని క్రూ సిబ్బంది గుర్తించారు. దీంతో అప్రమత్తమైన పైలట్లు వెంటనే విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయానికి మళ్లించారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ప్రయాణికులను క్షేమంగా దించేశాం.” అని స్పైట్ సిబ్బంది తెలిపారు.

అయితే, విమానం క్యాబిన్‌లో పొగలతో ప్రయాణికులు ఇబ్బంది పడుతోన్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనకు గల కారణాలేంటీ? విమానంలో ఎంతమంది ఉన్నారన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. గత కొన్ని రోజులుగా స్పైస్ జెట్ విమానాల్లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటంతో ప్రయాణికులు భయాందోళనకు గురౌతున్నారు. గతనెల 19న ఢిల్లీకి బయల్దేరిన ఓ విమానం ఇంజిన్‌లో మంటలు రావడంతో విమానాన్ని అత్యవసర పరిస్థితిలో పట్నాలో దించేసి, ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు.