వీళ్లిక మారరు.. కేబుల్ బ్రిడ్జిపై కారు నడిపారు - MicTv.in - Telugu News
mictv telugu

వీళ్లిక మారరు.. కేబుల్ బ్రిడ్జిపై కారు నడిపారు

November 2, 2022

Video: Tourists Drive Car On Karnataka’s Suspension Bridge Just Two Days After Morbi Tragedy

గుజరాత్‌లో మోర్బీ కేబుల్ బ్రిడ్జి దుర్ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. బ్రిడ్జి కూలి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటనకు కొందరు ఆకతాయిలు వంతెనను ఊపడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ విషాదం మరువక ముందే కర్ణాటకలో పర్యటకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

ఉత్తర కన్నడ జిల్లా యెల్లపురాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన శివపుర కేబుల్ బ్రిడ్జిపై ఏకంగా కారును ఎక్కించి నడిపే ప్రయత్నం చేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన టూరిస్టులు ఈ పని చేశారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వారిని అడ్డుకున్నారు. కారు బరువు కారణంగా వంతెన కూలే ప్రమాదం ఉందని హెచ్చరించి వారిని వెనక్కి పంపించారు. అయినప్పటికీ వారు వినిపించుకోకుండా స్థానికులతో వాగ్వాదం చేస్తూ కారును వంతెనపై కొంతదూరం తీసుకొచ్చారు. స్థానికులు గట్టిగా అభ్యంతరం చెప్పగా టూరిస్టులు కారును వెనక్కి తీసుకెళ్లారు. ఆ విధంగా ప్రమాదం నుంచి తప్పించారు.

 

కేబుల్ బ్రిడ్జిపై కారుని వెనక్కి తీసుకెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. కారు వెనుక చాలా మంది ఉన్నారు. వాహనాన్ని తోసేప్పుడు బ్రిడ్జి ఊగుతూ ప్రమాదకరంగా కనిపించింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ వీడియో చూసి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మీరసలు మనుషులేనా? అని ఆ టూరిస్టులపై నిప్పులు చెరుగుతున్నారు.