Home > Featured > వీడియో: విలక్షణమైన గణపయ్య..భక్తులను నిలబడి ఆశీర్వదిస్తున్నాడు..

వీడియో: విలక్షణమైన గణపయ్య..భక్తులను నిలబడి ఆశీర్వదిస్తున్నాడు..

దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు మొదలైయ్యాయి. ఆయా రాష్ట్రాల్లో గల్లీ గల్లీలో వెలసిన ఆయా మండపాల్లో నేడు వినాయకుని విగ్రహాలు కొలువుదీరాయి. వివిధ రూపాల్లో గణపతి విగ్రహాలు ప్రతిష్టించడ్డాయి. దీంతో భక్తులు బొజ్జ గణపయ్యకు పూజలు చేసి, నైవేధ్యాలను సమర్పిస్తున్నారు. పలు ప్రాంతాల్లో భక్తులు ఆశ్చర్యపోయేలా మండపాల చుట్టు రకరకాల డిజైన్‌లతో లైట్స్‌ను అమర్చారు. ఇటువంటి సమయంలో సోషల్ మీడియలో ఓ బొజ్జ గణపయ్యకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది.

తన పాదాలను తాకిన భక్తులను సింహాసనం నుంచి లేచి మరీ భక్తులను ఆశీర్వదిస్తున్నాడు. వీడియోను వీక్షిస్తున్న భక్తులు ఆశ్యర్యానికి లోనైతున్నారు. వినాయకుడు లేచి ఆశీర్వదించే విధంగా విగ్రహాన్ని తయారు చేసిన ఆర్టిస్ట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని సతారా జిల్లా చెందిన ఓ ఆర్టిస్ట్ విభిన్నంగా ఆలోచించి, సరికొత్త గణపయ్యను తయారు చేశాడు. గణపయ్య పాదాలను భక్తితో తాకిన ప్రతి భక్తుడిని ఆయన సింహాసనం నుంచి లేచి మరీ నిలబడి ఆశీర్వదించేలా రూపొందించాడు. అంతేకాదు, వినాయకుడు చెయ్యి ఎత్తి భక్తులను దీవించేలా చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ వినాయకుడు..యధాస్థానంలో తన పీఠంపై కూర్చునేలా చేశాడు. ప్రస్తుతం ఈ విలక్షణమైన వినాయక విగ్రహం వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

Updated : 31 Aug 2022 2:47 AM GMT
Tags:    
Next Story
Share it
Top