Video: Unfortunately, the starving elephant destroyed two bikes
mictv telugu

ఆకలితో అలమటించిన ఏనుగు..రెండు బైకులు ధ్వంసం

August 30, 2022

Video: Unfortunately, the starving elephant destroyed two bikes

ఓ ఏనుగు ఆకలితో అలమటిస్తూ, అడవి నుంచి నగరంలోకి ప్రవేశించిన సంఘటన అస్సాం రాష్ట్రంలో జరిగింది. ఆదివారం రోజున కజిరంగ నేషనల్‌ పార్క్‌ నుంచి బ్రహ్మపుత్ర నది గుండా ఓ ఏనుగు ఈదుకుంటూ ముందుకు సాగింది. చివరకు తేజ్‌పూజ్‌ నగరానికి చేరుకుంది. ఏనుగు రాకను గమనించిన ఆ నగరం ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.

ఆకలితో కేకలు వేస్తూ, ఆ ఏనుగా వీధుల్లో తిరుగుతూ, తిండి కోసం చాలా చోట్లకు వెళ్లింది. దారి మధ్యలో ఉన్న చెత్తకుప్పలవైపు వెళ్లింది. అయినప్పటికి ఆహారం దొరకకపోవడంతో పార్క్ చేసిన రెండు బైక్‌లను ధ్వంసం చేసింది. ఏనుగు తిండి కోసం అది పడిన తాపత్రయాన్ని కొంతమంది తమ ఫోన్లలో బంధించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే, ఆ ఏనుగు అస్సాం స్టేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ బస్టాండ్‌కు చేరుకొని, జనాల గోల నడుమ చిరాకుతో రెండు బైకులను నాశనం చేసింది. జిల్లా రవాణా విభాగపు కార్యాలయం గుండా నిర్జన ప్రాంతంలోకి ప్రవేశించడంతో స్థానికలు అడవిశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు..బలవంతంగా అర్ధరాత్రి సమయంలో తిరిగి బ్రహ్మపుత్ర తీరం వైపు తరలించారు. దాంతో నగరవాసులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.