Video: Vice President's big miss..Gun in point block
mictv telugu

వీడియో: తప్పిన పెను ప్రమాదం..పాయింట్ బ్లాక్‌లో గన్

September 2, 2022

అర్జెంటీనా దేశంలో తాజాగా జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అర్జెంటీనా ఉపాధ్యక్షురాలుగా ఉన్న క్రిస్టినా ఫెర్నాండెజ్ డె కిర్చనర్‌‌పై హత్యాయత్నం జరిగింది. అదృష్టం కొద్ది ఆ ప్రమాదం నుంచి ఆమె తృటిలో తప్పించుకున్నారు. కానీ, ఆమెతో ఉన్నవారందరు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. దుండగుడు పాయింట్ బ్లాక్‌లో గన్ పెట్టి, టీగర్ నొక్కిన ఆ తుఫాకీ పేలలేదు. దాంతో ఆ దుండగుడు అక్కడి నుంచి పరారైయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. అర్జెంటీనా ఉపాధ్యాక్షురాలు క్రిస్టినా ఫెర్నాండెజ్ డి కిర్చ్ నర్‌‌పై ఓ దుండగుడు ఆమె నుదుటిపై తుపాకీ ఎక్కు పెట్టి, కాల్చేందుకు యత్నించాడు. దీంతో ఖంగుతిన్న క్రిస్టినా.. కిందకు వంగి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తు చివరి క్షణంలో అది పేలకపోవడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. గురువారం రాత్రి తన ఇంటి వద్దకు వచ్చిన మద్దతుదారులను ఉపాధ్యక్షురాలు పలకరిస్తోన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అనంతరం ఈ దాడికి సంబంధించి, అధ్యక్షుడు ఆల్బెర్టో ఫెర్నాండెజ్ వివరాలను వెల్లడించారు. ”ఆ సమయంలో తుపాకీలో ఐదు బుల్లెట్లు లోడ్ చేసి ఉన్నట్లు గుర్తించాం. క్రిస్టినా ఫెర్నాండెజ్‌పై ఇటీవలే అవినీతి ఆరోపణలు వచ్చాయి. వాటిని ఆమె తిరస్కరిస్తున్నప్పటికీ..ఆ ఆరోపణలపై విచారణ జరుగుతోంది. ఇందులో భాగంగా గురువారం కోర్టుకు హాజరైన క్రిస్టినా, సాయంత్రం ఆమె నివాసానికి చేరుకున్నారు. అప్పటికే ఇంటివద్ద గుమిగూడిన మద్దతుదారులను పలకరించుకుంటూ, లోనికి వెళ్లే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఆమెకు అత్యంత సమీపంలో ఉన్న ఓ వ్యక్తి ఒక్కసారిగా తుపాకీ తీసి ఆమె నుదుటిపై గురిపెట్టి కాల్చేందుకు ప్రయత్నించాడు. చివరి క్షణంలో అది కాస్త జామ్ కావడంతో పేలలేదు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హత్యాయత్నం చేసిన వ్యక్తిని బ్రెజిల్ వాసిగా పోలీసులు గుర్తించారు.” అని ఆయన అన్నారు.