చిన్న చేపను పెద్ద చేప.. పెద్ద చేపను తిమింగలము.. అని ఓ పాత తెలుగు సినిమాలో పాట గుర్తోస్తుంది ఈ వీడియోను చూసినట్లయితే. సాధారణంగా కీటకాలను కప్పలు, కప్పలను పాములు, పాములను ముంగీసలు ఆహారంగా తీసుకొని తమ ఆకలిని తీర్చుకుంటాయని చదువుకున్నాం. ఏదైనా చిన్న ప్రాణిని మరో ప్రాణి వేటాడితే.. దాని సహ జీవులన్ని కలసి.. వేటాడుతున్న ప్రాణిని ధైర్యంగా ఎదుర్కొని వాటిని కాపాడుతాయి. కానీ, వేరే జంతువులు కాపాడటం చాలా అరుదు. తాజాగా ఇలాంటి షాకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఓ పాము.. కప్పను తినేందుకు ప్రయత్నించింది. అది గమనించిన చిరుత.. ఆ కప్పను కాపాడింది. చిరుత తన పంజాతో పాముకు ఒక్కటిచ్చింది. దెబ్బకు ఆ పాము గిలగిల గింజుకుంది. చిరుత దెబ్బకు పాము ఆ కప్పను విడిచిపెట్టగా.. కప్ప బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి పారిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
https://www.kooapp.com/koo/ViralINS/bc9359b7-9e09-404b-96b0-555a412244fe