ప్రయాణికురాలిపై కండక్టర్ కీచకం.. రేయ్ మారండ్రా.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రయాణికురాలిపై కండక్టర్ కీచకం.. రేయ్ మారండ్రా..

February 17, 2020

KSRTC bus.

మృగాళ్లు ఎప్పటికీ మారరు. ఓ వైపు దేశంలో మహిళల పట్ల దారుణాలకు తెగబడుతున్నవారికి చట్టాలు కఠిన శిక్షలు అమలు చేస్తున్నాయి. నిర్భయ, దిశ కేసుల్లో దోషులకు కఠిన శిక్షలు విధించారు. వాటిని చూసైనా ఒక్కడిలో కూడా మార్పు రావడంలేదు. పోలీస్ గానో, ఉపాధ్యాయుడిగానో, వైద్యుడిగానో, చివరికి ఇలా బస్ కండక్టర్‌గానో కామం కళ్లకు కమ్మిన మృగాడు వివిధ రూపాల్లో దర్శనం ఇస్తున్నాడు. వారి మాన ప్రాణాలను బలిగొనాలని చూస్తున్నాడు. తాజాగా కర్ణటకలో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రయాణికురాలితో కండక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. చేయి లాగుతూ, నొక్కుతూ ఆమెకు తీవ్ర ఇబ్బంది కలిగించాడు. 


ఆ నీచుడి పేరు శశిహరి షాలూర్. కన్నడ జిల్లా పుత్తూరు డిపోలో పనిచేస్తున్నాడు. పుత్తూరు నుంచి హసన్‌కు బస్సులో ఓ మహిళ ప్రయాణిస్తోంది. బస్సులో ఆమె తప్ప ఇతర ప్రయాణికులెవరూ లేరు. ఇదే అదనుగా భావించాడు. అంతే కామంతో కళ్లు మూసుకపోయాయి.  అమాంతంగా వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. మాటలు కలిపాడు. ఏదో మామూలుగా మాట్లాడుతున్నాడులే అనుకుంది ఆమె. అక్కడితో ఆగకుండా ఆమెపై చేతులు వేయడం ప్రారంభించాడు. వారించే ప్రయత్నం చేసినా వినకుండా అసభ్యంగా గిల్లసాగాడు. ఆమె చేతివేళ్లను మెలిపెట్టసాగాడు. ఆమె తెలివిగా ఇదంతా తన ఫోన్‌లో రికార్డు చేసింది. అతని అతిని తన గమ్యం చేరేవరకు భరించింది. హసన్‌కు చేరగానే ఈ వీడియోను సోషల్ మీడియాతో పాటు, ఆర్టీసీ అధికారులకు షేర్ చేసింది. అధికారులు ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు.