తెలుగులో పాపులర్ స్టార్లుగా వెలుగొందుతున్న ఇద్దరు హీరోలు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు అరుదైన తీపికబురు ఇది. ఈ ఇద్దరు హీరోల ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్ కల్యాణ్ కి రేణు దేశాయ్ ల సంతానం అకీరా, ఆద్య. వీరిద్దరు గొడవ పడిన స్టిల్స్ ని రేణుదేశాయ్ సోషల్ మీడియాలో రివీల్ చేశారు. ఇందులో చెల్లెలు ఆద్య చేతిలో దెబ్బలు తింటూ సరదాగా ఉన్న అకీరా.. మీసాలు, గడ్డంతో అచ్చం తండ్రి పోలికలతో ఉన్నాడు. నవ్వులో అయితే పవన్ కల్యాణ్ ని దించేశాడు. ఇప్పటికే మ్యూజిక్, కుంగ్ ఫూ కరాటే విద్యలలో నైపుణ్యం సాధించిన అకీరా నందన్ తెరంగేట్రానికి రెడీగా ఉన్నట్టు హింట్ ఇచ్చాడు. ఇక మహేశ్ బాబుకి గౌతమ్, సితార సంతానం. సితార సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తండ్రితో పాటు ఇప్పటికే పలు షోలలో కూడా పాల్గొంది. కానీ, గౌతమ్ అలా కాదు. ఇతని గురించి జనాలకు పెద్దగా తెలియదు. వన్ సినిమాలో మహేశ్ చిన్నప్పటి పాత్ర చేసినం వరకే తెలుసు.
View this post on Instagram
తాజాగా తల్లి నమ్రతా శిరోద్కర్ గౌతమ్ హైస్కూల్లో వేసిన మొదటి నాటకం వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘మొదటి థియేటర్ ప్రొడక్షన్ లో గౌతమ్ తనదైన స్టైల్లో నటించాడు. తనకు ప్రొజెన్ ఫ్యామిలీ ఫేవరెట్ అని చెప్పక్కర్లేదు’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కాగా, మహేశ్ బాబు కూడా మొదట్లో చైల్డ్ ఆర్టిస్టుగా రాణించి తర్వాత సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం లీడింగ్ పొజిషన్లో ఉన్నాడు. తండ్రిలాగే గౌతమ్ కూడా సిల్వర్ స్క్రీన్ పై మెరుస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఇలా ఒకేరోజు ఇద్దరు టాప్ హీరోల కొడుకుల అప్డేట్ రావడం అరుదనే చెప్పాలి. దీంతో అటు మెగా ఫ్యాన్స్, ఇటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు. ఈ రెండు వీడియోలు నెట్టింట్ వైరల్ గా మారాయనడంతో అతిశయోక్తి లేదు.