Videos of vijayawada Kanaka Durgamma Antaralaya are currently going viral on social media.
mictv telugu

ఇన్‌స్టాగ్రామ్‌లో బెజవాడ దుర్గమ్మ అంతరాలయం వీడియోలు

January 4, 2023

Videos of vijayawada Kanaka Durgamma Antaralaya are currently going viral on social media.

బెజవాడ కనకదుర్గమ్మ అంతరాలయం వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అంతరాలయంలోని అమ్మవారి వీడియోలను చిత్రికరించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అంతరాలయంలో ఫోటోలు, వీడియోలు తీయకూడదన్న నిబంధన ఉన్నా కూడా మూలవిరాట్ దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించడంపై పలు అనుమానాలకు దారితీస్తున్నాయి.

ఈ విషయంపై దృష్టి పెట్టిన ఆలయ యంత్రాంగం.. సీసీటీవీ ఫుటేజీల ద్వారా వీడియోలు తీసింది ఎవరో గుర్తించారు. శాంతకుమారి అనే భక్తురాలు వీడియోలు చిత్రీకరించినట్లు గుర్తించామని ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు. గత నెల డిసెంబర్ 22న గురువారం ఉ.9.52 గంటలకు భక్తురాలు చిత్రీకరించినట్లు గుర్తించామని వెల్లడించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా వీడియో చిత్రీకరణపై ఫిర్యాదు చేశామని ప్రకటించారు. దుర్గగుడిలో ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి కూడా నోటీసులు జారీ చేసినట్టు ఆమె తెలిపారు

భక్తులు మాత్రం.. ఆలయ సిబ్బంది సహకారంతోనే ఈ వీడియో చిత్రీకరణ జరిగివుండొచ్చనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ ఓ సామాన్య భక్తురాలు ఇంత సాహసం ఎలా చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఆలయ సిబ్బందిపై మండిపడుతూ.. కనీసం భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా పకడ్బందీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.