ప్లీజ్ మీరు గాడిదలు కావద్దు.. దర్శకుడి సంచలన కామెంట్ - MicTv.in - Telugu News
mictv telugu

ప్లీజ్ మీరు గాడిదలు కావద్దు.. దర్శకుడి సంచలన కామెంట్

February 13, 2020

Shikara

బాలీవుడ్ నిర్మాత  విధు వినోద్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తీసిన సినిమా చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవారు గాడిదలంటూ సంబోధించారు. ముందుగా సినిమా చూసి ఆ తర్వాత ఓ అభిప్రాయానికి రావాలని సూచించారు. ఆయన ఇటీవల తీసిన ‘షికారా’ సినిమాపై పలువురు చేస్తున్న విమర్శలకు ధీటుగా ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. 

1980 దశకంలో కశ్మీరీ పండిట్ల జీవితంపై ఆయన తీసిన షికారా సినిమా ఈనెల 7న విడుదలైంది. ఈ సినిమాపై కొంత మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బుల కోసం కశ్మీరీల జీవితాన్ని సినిమాగా తీశావా అంటూ కొంత మంది. ఉగ్రవాదాన్ని చూపించలేకపోయావంటూ మరికొంత మంది కామెంట్ చేశారు. దీనికి తోడు విధు వినోద్ చోప్రా గతంలో తీసిన సినిమాల కంటే ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లు చాలా తక్కువగా వచ్చాయి. దీంతో బాయ్ కాట్ షికారా అంటూ చేస్తున్న ప్రచారంపై ఆయన మండిపడ్డారు. 

సినిమా చూడకుండా అనాలోచితంగా విమర్శలు చేస్తున్న వారు గాడిదలన్నారు.తాను డబ్బుల కోసం ఆ సినిమా తీయలేదని చెప్పారు. అలా అనుకునే వారు గాడిదలన్నారు. తన తల్లి ఙ్ఞాపకార్థం ఈ సినిమా తీసినట్టు చెప్పారు. సుమారు 11 ఏళ్లు కష్టపడి కశ్మీరీల జీవితాన్ని చూపించానని చెప్పారు. కాగా ఇటీవల ఈ సినిమా చూసిన బీజేపీ కురవృద్ధుడు అతడు తీసిన విధానాన్ని మెచ్చుకున్నారు. ఓ దశలో ఆయన కన్నీరు కూడా పెట్టిన సంగతి తెలిసిందే.