బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ సెలక్టివ్ సినిమాలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది. తాజాగా ఆమె క్యాస్టింగ్ కౌచ్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనం చేపాయి. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు తెలిపింది. అయితే తెలివిగా దాని నుంచి బయటపడినట్లు చెప్పుకొచ్చింది ఈ బొద్దుగుమ్మ. ఓ డైరెక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని హాట్ కామెంట్స్ చేసింది.
లక్కీగా తాను క్యాస్టింగ్ కౌచ్ ఊబిలో చిక్కుకోలేదని చెప్పుకొచ్చింది. సినీపరిశ్రమకు వచ్చే ముందు ఇలాంటి పరిస్థితులు భయానకంగా ఉంటాయాని చాలా మంది తనకు చెప్పారని చెప్పింది. అందుకే మా తల్లిదండ్రులు భయపడి సినిమాల్లోకి పంపించేందుకు ఇష్టపడలేదని…ఇప్పటి వరకు తాను క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొలేదని…ఓసారి మాత్రం కొంచెంలో తప్పించుకున్నాను అంటూ వెల్లడించింది.
ఆ ఘటనకు సంబంధించి ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పింది విద్యాబాలన్. ఆ విషయాలన్నింటిని షేర్ చేసింది విద్యాబాలన్. ఓ యాడ్ షూటింగ్ కోసం చెన్నైకి వెళ్లినప్పుడు ఓ డైరెక్టర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించే ప్రయత్నం చేసినట్లు చెప్పింది. కాఫీ తాగడానికి వెళ్లాం. కథ గురించి మాట్లాడుతున్న సమయంలో మిగతా విషయాలను మనం రూముకు వెళ్లి మాట్లాడుకుందాం అని అన్నాడు. ఆ సమయంలో నేను ఒక్కదానినే ఉన్నారు. భయపడుతూ వెళ్లా. అక్కడికి వెళ్లిన తర్వాత వెంటనే తెలివిగా వ్యవహరించి తాను గది తలపులు తెరిచేపెట్టాను. అతనికి ఏం చేయాలో అర్థం కాక అక్కడ నుంచి వెళ్లిపోయాడు. సమయస్పూర్తితో వ్యవహారించడంతోనే నేను తప్పించుకున్నాను అంటూ విద్యాబాలన్ తెలిపింది.