భూమ్మీద సైఫెస్ట్ ప్లేస్ ఏదన్నా ఉందంటే అది వియన్నా ఒక్కటేనంట. ఆస్ట్రియా రాజధాని నగరం అయిన వియన్నాలో హాయిగా, ఆనందంగా ఉండొచ్చు అంటోంది. ఈయూఐ. ఇకక్కడ ఉండాలంటే పెద్దగా ఖర్చు కూడా అవ్వదు అని చెబుతోంది. జీవన ప్రమాణాల్లో సుస్థిరత, మౌలిక సదుపాయాలు, మంచి ఆరోగ్య వ్యవస్థ, విస్తృతమైన ఉపాధి అవకాశాలు, వినోదం–విజ్ఞానం–సంస్కృతి తదితర ప్రామాణికాల ఆధారంగా ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈయూఐ) ఏటా ఈ ర్యాంకులిస్తుంది. గతేడాది టాప్‌లో ఉన్న అక్లండ్ను తోసిరాజని వియన్నా తొలి స్థానంలోకి వచ్చిందని ఎకనామిస్ట్ పత్రిక ప్రచురించింది.
కరోనా దెబ్బకు ఆక్లండ్ 34వ స్థానానికి పడిపోయింది. వియన్నా 2018, 2019 ల్లో నూ తొలి స్థా నంలో నిలిచింది. కరో నా వచ్చిన కొత్తల్లో రెస్టారెంట్లు, మ్యూజియంలు తదితరాలన్నీ మూతబడటంతో 2020లో 12వ స్థానానికి పడిపోయింది. సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఈసారి మొదటి స్థానంలో నిలిచిందని నివేదిక వెల్లడించింది. డెన్మార్క్ రాజధాని కోపెన్హగెన్ రెండో స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్‌కు చెందిన జ్యురిచ్, కెనడాలోని కేల్గరీ నగరాలు సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. పారిస్ 19 స్థానంలో, లండన్ 33, మిలన్ (ఇటలీ) 49, న్యూయార్క్ 51వ స్థానంలో నిలిచాయి.
అయితే ఈ లెక్కలు అన్నీ 2022వ సంవత్సరానివి. కేలండర్ మారింది…రోజులు మారాయి, పరిస్థితులూ మారుతున్నాయి. మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు ఆర్ధిక మాంద్యం తరుముకొస్తోంది. కాబట్టి ఈ ఏడాది అన్ని లెక్కలూ మళ్ళీ మారిపోతాయి. మళ్ళీ ఉత్తమ నగరాల లిస్టూ మారిపోతుంది. అయితే అది తెలియడానికి కనీసం ఏడాదిలో ఆరు నెలలు అయినా టైమ్ పడుతుంది. ఈలోపు అయితే సెటిల్ అవ్వడానికి కాపోయినా ఎంచక్కా ఆస్ట్రియా, వియన్నాలను బాగా తిరిగేసి టూరిజం చేసేయెచ్చు.
ఈయూఐ ప్రకారం టాప్ 10 నగరాలు ఇవే.
1. వియన్నా (ఆస్ట్రియా)
2. కోపెన్హగెన్ (డెన్మార్క్)
3. జ్యురిచ్ (స్విట్జర్లాండ్)
4. కాల్గరీ (కెనడా)
5. వాంకోవర్ (కెనడా)
6. జెనీవా (స్విట్జర్లాండ్)
7. ఫ్రాంక్ఫర్ట్ (జర్మనీ)
8. టొరంటో (కెనడా)
9. ఆమ్స్టర్డామ్ (నెదర్లాండ్స్)
10. ఒసాకా (జపాన్)
మెల్బోర్న్ (ఆస్ట్రేలియా)