నీకు ఎంత దైర్యం.. నయనతారపై అత్త షాకింగ్ కామెంట్స్! - MicTv.in - Telugu News
mictv telugu

నీకు ఎంత దైర్యం.. నయనతారపై అత్త షాకింగ్ కామెంట్స్!

November 25, 2022

సౌత్ సినిమా రారాణి నయనతార తమిళ ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ ని ఇటీవలే వివాహం చేసుకున్నారు. ఎప్పుడు ఏదొక వివాదం వెంటాడినట్టే పెళ్లి తరువాత కూడా సరోగసీ కారణంగా వార్తల్లో నిలిచింది నయనతారని. అద్దె గర్భం ద్వారా కవల మగపిల్లలకు జన్మనిచ్చింది నయన్. అది చట్టబద్దం కాదని, నయనతార అరెస్ట్ తప్పదని ఒక నెలపాటు కథనాలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ సరోగసి వివాదం వల్ల వాళ్లకి ఐదేళ్ల క్రితమే వివాహం జరిగింది అనే విషయం కొత్తాగా వెలుగు చూసింది. తగిన ఆధారాలు చూపించి నయనతార దంపతులు ఆ వివాదం నుంచి బయటపడ్డారు. ఇప్పుడు ఈ జంట మరోసారి వైరల్‌ అయ్యింది. విగ్నేష్ శివన్ తల్లి తన కొత్త కోడలు నయనతారపై షాకింగ్ కామెంట్స్ చేసింది. అత్తయ్య కామెంట్స్ తో నయనతార పేరు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

విఘ్నేష్ శివన్ తల్లి మీనా కుమారి ఇటీవల ఒక వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ, “నా కొడుకు విజయవంతమైన దర్శకుడు అయితే నా కోడలు నయనతార టాప్ హీరోయిన్. వారిద్దరూ కష్టపడి పని చేస్తారు. ఇంట్లో ఎనిమిది మంది చేసే పని నయనతార ఒక్కతే చేసేస్తుంది. పని వాళ్ళల్లో ఒకరు 4 లక్షల రూపాయల అప్పు ఉందని బాధపడుతుంటే నయనతార ఆమెకు వెంటనే డబ్బు ఇచ్చి తన అప్పు తీర్చమని చెప్పింది. అలా చేయడానికి నిజంగా దైర్యం ఉండాలి. దానికి మించి మంచి మనసు ఉండాలి. నా కోడలికి ఆ రెండు ఉన్నాయి’ అని అత్త నుండి అనూహ్య ప్రంశంసలు అందుకుంది నయనతార. ఇక నయన్ ప్రస్తుతం చేతి నిండా పాన్‌ ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ బిజీ అయిపోయింది. తమిళ్, మలయాళం, హిందీ సినిమాలు చేస్తోంది. తమిళ్‌ సినిమా కనెక్ట్‌ షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది.