ముద్దు పెడతారు కాబట్టి ఇక నుంచి మేకప్ వేసుకోకు - MicTv.in - Telugu News
mictv telugu

ముద్దు పెడతారు కాబట్టి ఇక నుంచి మేకప్ వేసుకోకు

November 18, 2022

స్టార్ హీరోయిన్ నయనతార, విఘ్నేష్ జంట ఇటీవల తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. సరోగసి విధానం ద్వారా ఇద్దరు మగ కవల పిల్లలు పుట్టారు. అటు పెళ్లి తర్వాత, ఇటు పిల్లలు పుట్టిన తర్వాత నయనతారకు మొదటి పుట్టినరోజు (నవంబర్ 18) కావడంతో దంపతులు స్పెషల్ గా ఫీలవుతున్నారు. భార్య నయనతారకు విఘ్నేష్ సోషల్ మీడియాలో విష్ చేస్తూ తన ప్రేమను మరోసారి వ్యక్తపరిచారు. అందులో ‘నీతో నాకు 9 ఏళ్ల పరిచయం.

ఈ రోజు చాలా స్పెషల్. భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా ఈ ఏడాదిలో ప్రమోషన్ పొందాం. నువ్వు చాలా శక్తివంతమైన దానివి. అంకితభావంతో పనిచేస్తుంటావు. ఓ తల్లిగా నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు. మన పిల్లలు ముద్దాడతారు కాబట్టి ఇక నుంచి మేకప్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. నేను జీవితంలో సెటిల్ అయ్యాననిపిస్తోంది. లైఫ్ అందంగా, సంతోషంగా ఉంది. మనలాగే అందరి పుట్టినరోజులు ఉండాలని కోరుకుంటున్నా. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.. మై డియర్ లేడీ అండ్ సూపర్ స్టార్’ అంటూ తన భావాలను పంచుకున్నారు