Home > Featured > విజయ్ అంటోని 'బిచ్చగాడు 2' రిలీజ్ డేట్ ఫిక్స్

విజయ్ అంటోని 'బిచ్చగాడు 2' రిలీజ్ డేట్ ఫిక్స్

Vijay Antony’s Bichagadu 2 Gets Release Date

తమిళ హీరో విజయ్ ఆంటోని గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. ప్రయోగాత్మక సినిమాలకు మారుపేరుగా పలు సినిమాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన హీరో. 2016లో తమిళంలో ‘పిచ్చైక్కరన్’ మూవీతో ఊహించని విజయం అందుకున్న అతడు.. సినీ చరిత్రలో ఎవరూ చేయని సాహసంతో మెప్పించాడు. ఇదే మూవీని తెలుగులో ‘బిచ్చగాడు’ టైటిల్‌తో విడుదల చేశాడు. ఆ టైటిల్ చూసి మొదట్లో అంతా నోరెళ్లబెట్టారు. సినిమా చూసి వచ్చిన తర్వాత విజయ్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఇప్పుడు అదే మూవీకి సీక్వెల్ వస్తోంది. అదే ‘బిచ్చగాడు-2’.

ఈ మేరకు మేకర్స్ మూవీ రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. ‘బిచ్చగాడు’ మొదటి పార్ట్ 144 రోజుల బ్లాక్ బస్టర్ కావడంతో.. భారీ అంచనాల మధ్య సీక్వెల్‌ని సమ్మర్‌ స్పెషల్‌గా ఏప్రిల్ 14 న విడుదల చేయనున్నారు. కాగా.. ఈ సినిమాను విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మిస్తుండగా.. కథ, దర్శకత్వంతో పాటు సంగీతం, ఎడిటింగ్ బాధ్యతలూ విజయ్ ఆంటోని నిర్వహిస్తున్నారు. బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కావ్య థాపర్ నాయికగా నటిస్తోంది.

ఈ సినిమాను ఏకకాలంలో తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ కూడా స్టార్ నెట్వర్క్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇటీవల ఈ మూవీ నుంచి ‘స్నీక్ పీక్ ట్రైలర్’ను విడుదల చేశారు. ఇందులో ఈ సినిమా కాన్సెప్ట్‌ను రివీల్ చేశారు. సినిమాలోని మొదటి నాలుగు నిమిషాల సీన్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు.

Updated : 27 Feb 2023 9:35 PM GMT
Tags:    
Next Story
Share it
Top