ఆడియో ఫంక్షన్ లో రెహమాన్ లైవ్ సాంగ్... - MicTv.in - Telugu News
mictv telugu

ఆడియో ఫంక్షన్ లో రెహమాన్ లైవ్ సాంగ్…

August 4, 2017

హీరో విజయ్ అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం మెర్సల్. ఈ సినిమా తెలుగులో అదిరింది అనే టైటిల్ తో వస్తుంది. ఈ మూవీలో విజయ్ మూడు విభిన్న పాత్రలలో కనిపించనున్నారట. ఇందులో నిత్యామీనన్, సమంత, కాజల్ హీరోయిన్లు గా నటిస్తున్నారు.

కమర్షయల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాహుబలి మూవీకి కథను అందించిన విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. అస్కార్ అవార్డు గ్రహిత ఏ ఆర్ రెహమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ సమాకూరుస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ ను ఆగస్టు 20 న చెనై లో నిర్వహించాలని మూవీ యూనిట్ భావించారు. టాప్ సెటబ్రిటీలు ఈ ఆడియో పంక్షను కు హాజరు కానున్న సందర్బంగా ఏ ఆర్ రెహమన్ చేత స్పెషల్ సాంగ్ ని లైఫ్ పర్ ఫార్మెన్స్ ఇప్పించాలని మూవీ యూనిట్ అనుకుంటుందట.

అంతేకాక ఈ ప్రోగ్రామ్ లోనే టీజర్ ను విడుదల చేసి విజయ్ అభిమానులకు మంచి కిక్ ఇవ్వాలని అనుకుంటున్నారట మూవీ నిర్మాతలు. ఈ సినిమాను శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తుంది. ఒక సాంగ్ కోన్ని ముఖ్యమైన సీన్స్ కంప్లీట్ చేసుకోవలసి ఉందట. ఈ చిత్రంలో ఎస్ జే సూర్య, సత్యరాజ్, వడివేలు, సత్యన్, కోవై సరళ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.