ఎదిగిన కొద్దీ ఒదగడం వద్దంటున్న కుర్ర హీరో ! - MicTv.in - Telugu News
mictv telugu

ఎదిగిన కొద్దీ ఒదగడం వద్దంటున్న కుర్ర హీరో !

August 23, 2017

విజయ్ దేవరకొండ ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్నవాడు. ఎదిగేవాడికి ఒదుగుదల చాలా అవసరం. కానీ అతనకి అదంటే ఎలర్జీ కాబోలు అస్సలు ఎవరి ముందూ తల దించకూడదని, రెస్పెక్ట్ అనేది ట్రాష్ అన్నట్టే చెప్పాడు. అప్పుడే ‘ పెళ్ళి చూపులు ’ అనే ఒక్క సినిమాకే కొమ్ములు మొలిచాయా ? ఇంతలోనే అంత కాన్ఫిడెన్సా ? దీన్ని కాన్ఫిడెన్సు కన్నా ఓవర్ కాన్ఫిడెన్సు అనొచ్చునేమోననే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. తను స్టేజ్ మీద మాట్లాడిన మాటలు ఎలా వున్నాయంటే ‘ లేక లేక కలిగిన సిరిని చూసి మిడిసి పడ్డట్టే వున్నది ’ అంటున్నారు నెటిజనులు. ఒకసారి అతని మాటలను గనక గమనిస్తే ‘ అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది. కాకపోతే నా అకౌంట్లో డబ్బులన్నీ ఇచ్చేస్తానని, కాదని ఎవరైనా నాతో ఛాలెంజ్ చేస్తారా ? ’ అంటూ ప్రేక్షకులతో ఛాలెంజ్ చేసాడు. బహుశా విజయ్ కి అర్జున్ రెడ్డి సినిమాలోని క్యారెక్టర్ బాగా ఎక్కినట్టుంది. అందుకే స్టేజీ మీద ఆ క్యారెక్టర్ లానే విర్రవీగి పోయాడు.

చేసింది రెండు, మూడు సినిమాలే. అప్పుడే ఈ లెవల్ మాటలా ? ఆ లెవల్లో మాట్లాడితే ఏ మెగాస్టారో, రజినీకాంతో, సల్మాన్ ఖానో మాట్లాడాలి గానీ ఈ కుర్ర హీరో మాట్లాడతాడా ? అదీ అస్సలు పస, రెస్పెక్టు లేకుండా. సినిమాలో మాట్లాడిన మాటలే ఎక్కువనుకుంటే స్టేజీ మీద కూడా అసభ్య పదజాలాన్ని వుపయోగించాలా ? ఒక నటుడు అనేవాడిని లక్షలు, కోట్ల మంది చూస్తుంటారు. చాలా మంది చాలా రకాలుగా విమర్శిస్తుంటారు. అంత మాత్రం చేత విజయ్ అదుపుతప్పి ఇంత ర్యాష్ గా రియాక్ట్ అవ్వాలా ? చిరంజీవి అంతటివాడే స్టేజీ ఎక్కితే పట్టుకున్న మైకుకు, నిలబడ్డ స్టేజీకి, ముందున్న ప్రేక్షకులకు, పరోక్షంగా వున్న అభిమానులకు ఎప్పుడూ రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడుతాడు. వాళ్ళ ఎక్స్ పీరియన్స్ ముందు ఇతనిది ఏ పాటిది ? ఇంత ఓవర్ కాన్ఫిడెన్సు పనికిరాదు, ఎంత పెద్ద రాబందైనా పేద్ద గాలిదుమారానికి నేలకొరుగుతుంది. ఈయనింకా రాబందు కూడా కాదు రాబందు గుడ్డు లాంటివాడు. వెలితిపడితే పగిలిపోవడం ఖాయం.

ఖర్మగాలి అర్జున్ రెడ్డి తను ఛాలెంజ్ చేసినట్టు బ్లాక్ బస్టర్ కాకపోతే జనాలు వూరుకుంటారా ? జనాలకు అభిమానించడమూ తెలుసు, తీసి అవతల పారేయడమూ తెలుసు. అప్పుడు సోషల్ మీడియాలో విజయ్ కన్నా పెద్ద జోకర్ వేరే ఎవరూ వుండరేమో. ఇన్ని రోజులూ తెర మీద తొడలు కొట్టిన హీరోలను చూసి విసిగిపోయిన ప్రేక్షకులకు ఇలా లైవ్ లో కూడా తీస్మార్ ఖాన్ లెక్క మాట్లాడుతున్న ఈ అప్ కమింగ్ హీరో మాటలు చూసి త్వరలోనే జీరో అవడం ఖాయం అంటున్నారు జనాలు. ఎంత ఎదిగినా ఒదిగేవాడే ఇంకా ఎదుగుతాడు. విజయ్ లో ఆ లక్షణాలు బొత్తిగా కనిపించడం లేవు ? సెన్సార్ వాళ్ళు చేసిన డ్యూటీ కూడా తప్పన్నట్టు మాట్లాడాడు. ఈయన సినిమాకు వాళ్ళు క్లీన్ యూ సర్టిఫికేట్ ఇవ్వాలన్నట్టే వాగాడు. సినిమాలో హీరో లవర్ ను ఎవడో రౌడీగాడు కెలికితే ఈయనగారు ‘ ఎవడ్రావాడూ మా…….,,,,, ’ అని తిడతాడు.

విలనంటే హౌలాగాడై ఇతని లవర్ ని కెలికాడు. మరి హీరోగారు ఎంత బుద్ధిమంతుడో కదా విలన్ అమ్మని…., అనేసాడు. ఈ పచ్చి బూతును విజయ్ సమర్థించుకుంటున్న తీరును చూస్తుంటే నవ్వొస్తోంది చాలా మందికి. అసలు విజయ్ కి ఆ ఉర్దూ బూతుకు అర్థం తెలిసే మాట్లాడుతున్నాడా లేక తెలియక మాట్లాడుతున్నాడా అతనికే తెలియాలంటున్నారు ? బాబూ నాయనా బంగారం, చిట్టికొండా, బంగారు భవిష్యత్తు వున్న హీరోగారూ.., కాస్త లిమిట్స్ ను అలవాటు చేసుకోండి. అవసరమైతే దానికోసం ఏమైనా యోగా గట్రా వుందేమో ప్రాక్టీస్ చెయ్యండి. లేదంటే తనొక్కడి వల్ల ఇప్పుడిప్పుడే బంగారు భవిష్యత్తు దిక్కు పయనిస్తున్న ఒక ప్రాంతం ఇజ్జత్ మంట కలిసేట్టుగా వుంది ????