సమంత నా మరదలు...! - MicTv.in - Telugu News
mictv telugu

సమంత నా మరదలు…!

August 30, 2017

’అర్జున్ రెడ్డి’ సిన్మమీద  మాటల యుద్దాలు ఇప్పుడప్పుడే అయిపోయేటట్టు లేవు. సిన్మ రిలీజ్ కాకముందు ముద్దు పోస్టర్ దగ్గర మొదలైన వివాదం…సిన్మ రిలీజ్ అయ్యి సూపర్ హిట్టైనా ఇంకా నడుస్తనే వుంది. బస్సు మీద ముద్దు పోస్టర్ చింపిన కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావ్…ఇప్పుడు అర్జున్ రెడ్డి సిన్మను బ్యాన్ చెయ్యాలె అని  డిమాండ్ చేశారు. అయితే ఇటీవలే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా సినిమా బాగుందని అన్నారు. కేటీఆర్ కు  విజయ్ బంధువు అవడం వల్లనే ఈ సినిమాని ఆయన మెచ్చుకున్నాడని హనుమంతరావ్ కామెంట్ చేశారు.

విహెచ్ కామెంట్లకు విజయ్ దేవరకొండ తన ఫేస్ బుక్ పేజ్ లో ఈ విధంగా స్పందించాడు. ‘డియర్ తాతయ్యా  మీ లాజిక్ చాలా బాగుంది.  అర్జున్ రెడ్డి  సినిమా బాగుందని కేటీఆర్ అనడంతోనే ఆయనకు నాకు బంధువైతే.. అప్పుడు, ఎస్ఎస్ రాజమౌళి గారు నాకు నాన్న అవుతారు.  రానా దగ్గుబాటి, నాని, శర్వానంద్, వరుణ్ తేజ్ నా బ్రదర్స్ అవుతారు. నాకు సిస్టర్స్ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి, సమంత, అనూ ఇమ్మానుయేల్, మెహ్రీన్ పిర్జాదా నాకు మరదళ్లు అవుతారు. ఇక ఐదు రోజుల్లో 5000కి పైగా ప్రదర్శనలను చూసిన నా స్టూడెంట్స్, పురుషులు, మహిళలు అందరూ నా కవలలు. ముఖ్యంగా రాంగోపాల్ వర్మ సార్ అయితే మన ఇద్దరిలో ఎవరి తండ్రో ఇంకా క్లారిటీ లేదు… తాతయ్యా చిల్’ అంటూ విజయ్ తన ఫేస్ బుక్ లో  పోస్ట్  పెట్టాడు.