అమ్మాయిల వెంట తిరగడం వేస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మాయిల వెంట తిరగడం వేస్ట్

February 13, 2018

బీభత్సమైన ప్రేమికుడు, భగ్నప్రేమికుడు ‘అర్జున్ రెడ్డి’. ఈ సినిమాతో టాలీవుడ్‌లో తన జెండాను బలంగా పాతేసుకున్న కుర్రహీరో విజయ్ దేవరకొండ మాత్రం అసలు జీవితంలో ప్రేమాదోమా వద్దని సలహా ఇస్తున్నాడు. ఐఐటీ ఎలాన్, ఎన్‌విజన్ ముగింపు కార్యక్రమంలో అతుడు యువతకు విలువైన సందేశాలు ఇచ్చాడు.

‘నాకూ ఓ లవర్ ఉండేది. కానీ అన్నీ వదిలేసి సినిమాలు చేసుకుంటున్నా.. గైస్.. మీరు.. జీవితంలో ఎంజాయ్ చేయండి. అంతేకాని ప్రేమ అంటూ అమ్మాయిల వెంట తిరగొద్దు. అదో టైమ్ వేస్ట్ వ్యవహారం.. బాగా చదువుకుని జీవితంలో సెటిలైతే మంచి లైఫ్ ఉంటుంది, ఆటోమెటిగ్గా మంచి భార్య వస్తుంది.. మీరు మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి’ అని చెప్పాడు. కాగా, ఈ  కార్యక్రమం చివర్లో ఓ అభిమాని తన మెడలోని పూసల దండను విజయ్ దేవరకొండకు ఇచ్చాడు. ఈ అభిమానానికి విజయ్ పొంగిపోతూ తన ఉంగరాన్ని తీసి అతడికి గిఫ్ట్‌గా ఇచ్చాడు.

అర్జున్ రెడ్డి సక్సెస్ తో విజయ్ కి ఆఫర్లపైన ఆఫర్లు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతని చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయి. గీతా ఆర్ట్స్-2 (జీఏ2), యూవీ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రీలుక్‌ను విజయ్ తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేయడం తెలిసిందే. ఈ సినిమాకు ట్యాక్సీవాలా అని పేరు పెడుతున్నట్లు సమాచారం.