టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా తీయడం తెలిసిందే. ఆ సినిమాకు ప్రేక్షకాదరణ కూడా రావడంతో విజయ్ మరిన్ని సినిమాలపై దృష్టి పెట్టారు. తన సినిమాలకు కూడా భారీగానే పారితోషికం తీసుకుంటున్నారు. ఆయన మరో కల గురించి ఫిలిం నగర్లో కొత్త ముచ్చట షికార్లు చేస్తోంది. అక్కడ హీరో శ్రీకాంత్ ఇంటికి చేరువలో విజయ్ ఓ ఇంటిని కొని, ఈ రోజు గృహప్రవేశం చేశాడన్నది ఆ వార్త.
భారీ మొత్తం వెచ్చించి ఈ ఇంటిని కొన్నారని, సువిశాలంగా, ఆహ్లాదకరంగా దాన్ని తీర్చిదిద్దారని అంటున్నారు. ఈ రోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలసి విజయ్ కొత్తింట్లోకి అడుగు పెట్టారని చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించిన ఫొటోలు బయటికి రావడం లేదు. సాధారణంగా విజయ్ ఇలాంటి విషయాలన సోషల్ మీడియాతో పంచుకుంటుంటాడు. కాగా, విజయ్ తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ షూటింగులో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పారితోషికం కింద నిర్మాత కె.ఎస్ రామారావు ఫిలిం నగర్లో విజయ్‌కి ఇల్లు కొనిపెట్టారని వార్తలు వస్తున్నాయి.