ఆనంద్ దేవరకొండ వచ్చేశాడు.. దొరసానిగా శివాత్మిక.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆనంద్ దేవరకొండ వచ్చేశాడు.. దొరసానిగా శివాత్మిక..

September 28, 2018

అర్జున్ రెడ్డి తర్వాత వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు విజయ్ దేవరకొండ. ఈ ఊపులోనే తన తమ్ముణ్ణి కూడా తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాడు. ‘దొరసాని’ అనే చిత్రంతో విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఆనంద్ కొద్ది రోజులుగా ఫిలిం క్రాఫ్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకున్నాడు. అంతేకాదు ఫిజికల్‌ ఫిట్‌నెస్ కూడా పెంచుకున్నాడు.Vijay Devarakonda brother Anand Movie dorasani launch date fixed Jeevitha Rajashekar second daughter sivatmika ‘నిశీధి’ అనే షార్ట్ ఫిలింతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. అక్టోబర్ 10న ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ సినిమా కథ 1980ల నాటి ఓ తెలంగాణ గ్రామానికి సంబంధించినది. ఇందులో ఆనంద్ సరసన జీవితారాజశేఖర్ రెండో కుమార్తె శివాత్మిక హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఈ చిత్రాన్ని సురేష్‌ బాబు సమర్పణలో యష్‌ రంగినేని, మధుర శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.