హమ్మో.. విజయ్ దేవరకొండ బంగీ జంప్..(వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

హమ్మో.. విజయ్ దేవరకొండ బంగీ జంప్..(వీడియో)

November 29, 2019

బంగీ జంప్ అంటే మాటలు కాదు.. అది డెడ్లీ ఫీటే. ఏమాత్రం తేడా కొట్టిన ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. అంతెత్తు ఆకాశంలో గాల్లో తేలిపోవాలి. అందుకు చాలా ధైర్యం కావాలి. గతంలో ఇలాంటి బంగీ జంపులను మెగాస్టార్ చిరంజీవి, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేశారు. తాజాగా విజయ్ దేవరకొండ కూడా బంగీ జంప్ చేసి తన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు. 

ఒళ్లు గరుర్పొడిచే స్కైడైవింగ్ చేసి, తన గుండె ధైర్యాన్ని చాటాడు. విదేశాల్లో విజయ్ చేసిన స్కైడైవింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇన్‌స్ట్రక్టర్ సాయంతో హెలికాప్టర్ నుంచి విజయ్ బయటకు దూకాడు. ఈ సందర్భంగా ఓ కెమెరాను కూడా చేత్తో పట్టుకున్నాడు. అనంతరం ఇన్‌స్ట్రక్టర్ ప్యారాచూట్‌ను ఓపెన్ చేశాడు. ఒక నిమిషం పాటు గాల్లో చక్కర్లు కొట్టిన తర్వాత వీరిద్దరూ సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. క్రింది లింకులో మీరూ వీడియో చూడొచ్చు.